Online Shopping: ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్ పాటిస్తే మోసపోరు..

Online Shopping: గతంలో షాపింగ్ చేయాలంటే పెద్ద పనిలా ఉండేది. ఏ వస్తువులను కొనుగోలు చేయాలో ముందు నిర్ణయించుకొని బజారుకు వెళ్లేవాళ్లు. ఒక్కోసారి కావాల్సిన వస్తువులు దొరికేవి కావు.

Written By: Chai Muchhata, Updated On : June 21, 2024 3:45 pm

Online-Shopping

Follow us on

Online Shopping: మొబైల్ టెక్నాలజీ వచ్చాక ఏ పని చేయాలనుకున్నా ఆన్ లైన్ లో చేస్తున్నారు. మనీ ట్రాన్స్ ఫర్ నుంచి షాపింగ్ వరకు మొబైల్ తోనే చేస్తున్నారు. చాలా సులభంగా, తొందరగా షాపింగ్ చేయడానికి ఇది అనువుగా ఉండడంతో అందరూ దీనికే అలవాటుపడుతున్నారు. ఇంటి దగ్గరీ ఉండి మరీ తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేసుకుంటున్నారు. దీని వల్ల సమయంతో పాటు డబ్బులు కూడా కొన్ని ఆఫర్ల ద్వారా డబ్బులు కూడా ఆదా అవుతున్నాయి. ఒకేసారి అనేక వస్తువులను పరిశీలించి, ధరల వివరాలు తెలుసుకుని తమకు వచ్చిన దానిని ఎంచుకునే సౌలభ్యం కూడా దీనిలో లభిస్తుంది. కాన్ ఆన్ లైన్ షాపింగ్ లో సైబర్ నేరగాళ్ల భయం రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా షాపింగ్ చేయొచ్చని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

గతంలో షాపింగ్ చేయాలంటే పెద్ద పనిలా ఉండేది. ఏ వస్తువులను కొనుగోలు చేయాలో ముందు నిర్ణయించుకొని బజారుకు వెళ్లేవాళ్లు. ఒక్కోసారి కావాల్సిన వస్తువులు దొరికేవి కావు. అంతేకాకుండా షాపింగ్ చేయాలంటే ఒక్కోసారి రోజంతా గడిచేది. ఇక పెళ్లిళ్ల సమయంలో అయితే రోజుల తరబడి షాపింగ్ చేయాల్సిన పని ఉంటుంది. కానీ ఆన్ లైన్ షాపింగ్ విధానం వచ్చాక.. అంతా ఇంటి నుంచే షాపింగ్ చేస్తున్నారు.

Also Read: Love: టాకింగ్, చాటింగ్, డేటింగ్ ఇదేనా ప్రేమంటే?

ఆన్ లైన్ షాపింగ్ వల్ల అనేక లాభాలు ఉన్నప్పటికీ మోసాలు జరుగుతుండడం చూస్తున్నాం. కొందరు సైబర్ నేరగాళ్లు ఫేక్ వెబ్ సైట్ల ద్వారా వస్తువులను విక్రయిస్తూ మోసం చేస్తున్నారు. మరికొందరు ఆకర్షణీయమైన వస్తువులు అని చెప్పి వినియోగదారుల నుంచి డబ్బులు లాగేసుకుంటు్నారు. ఇలాంటి తరుణంలో కొన్ని టిప్స్ పాటించడం వల్ల సైబర్ నేరగాళ్ల బారి నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఆన్ లైన్ లో షాపింగ్ చేసేటప్పుడు ముందుగా సంస్థ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఆ సంస్థ బ్రాండెడ్ అయితే దాని లోగో ప్రత్యేకంగా ఉంటుంది. కొన్ని వస్తువులు భారీ తగ్గింపుతో ఆకర్షిస్తాయి. అయితే ఈ వస్తువులు బ్రాండెట్ సంస్థల్లో ఉన్నాయా? లేవా? తెలుసుకోవాలి. ఒకవేళ ఈ వస్తువులు అక్కడ చూపించకపోతే అవి ఫేక్ అని గుర్తించాలి. ఫేస్బుక్, య్యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా కొన్ని యాడ్స్ వస్తుంటాయి. వీటిల్లో తక్కువ ధరకే వస్తువులను విక్రయిస్తున్నట్లు ప్రకటనలు వస్తుంటాయి. ఇదే సమయంలో కొన్ని లింక్స్ ఇస్తారు. ఇలాంటి లింక్స్ క్లిక్ చేయకుండా ఉండాలి.

Also Read: Smartphone Addiction: పిల్లలు ఫోన్ లో బ్యాడ్ వీడియోలు చూడకూడదు అంటే ఏం చేయాలి?

సాధ్యమైనంత వరకు క్యాష్ అన్ క్యారీ వస్తువులనే కొనుగోలు చేయాలి. చాలా మంది డబ్బులు పే చేశాక నకిలీ వస్తువులు వస్తుంటాయి. ఇవి ప్రముఖ సంస్థలైనా.. వారు పంపించకపోయినా మధ్యలో మారుతూ ఉంటాయి. అందువల్ల క్యాష్ అండ్ క్యారీ వల్ల వస్తువును పూర్తిగా చెక్ చేసుకున్న తరువాతే డబ్బులు చెల్లించేలా ఏర్పాటు చేసుకోండి. ఆన్ లైన్ షాపింగ్ ను పబ్లిక్ వైఫై నెట్ కనెక్ట్ అయి చేయకండి ఇలా చేయడం వల్ల మనీ యాప్ లకు సంబంధించిన పాస్ వర్డ్ తెలిసిపోతుంది.