Car: దేశంలో కార్ల ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొందరు నిర్లక్ష్యంగా కారు నడపడంతో పాటు మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల కారు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అయితే ఈ ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటే మరికొందరు మాత్రం సురక్షితంగా బయటపడుతున్నారు. సురక్షితంగా బయటపడేవారి గురించి మాట్లాడితే వీరు కారు ప్రమాదాన్ని ఎదుర్కొన్నా.. వీరికి ఏం కాలేదంటే కారు సేప్టీ దై ఉండాలి. ఇటీవల దేశంలో జరిగిన ఓ కారు ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కానీ అందులోని ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అంటే ఈ కారుకు ఉన్న సేప్టీ ఫీచర్స్ తోనే ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని ఆటోమోబైల్ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ కారు ఏదంటే?
పై ఫొటోలో కనిపిస్తున్న కారును చూస్తే మాములు యాక్సిడెంట్ అనలేం. కానీ ఇందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటకు వచ్చారని తెలుస్తోంది. ఎందుకంటే కారు ఇంజిన్ భాగం మాత్రమే దెబ్బతింది. సీట్ల ప్రదేశంలో ఎలాంటి ధ్వంసం కాలేదు. ఇంతకీ ఈ కారు ఏదంటే.. టాటాకు చెదిన హారియర్. ప్రముక కార్ల కంపెనీ టాటా ఎస్ యూవీ హారియర్ ను ఆ తరువాత ఈవీగా మార్చేసింది. అయితే ఇక్కడ ప్రమాదంలో ఉన్నది మాత్రం హారియర్ ఫేస్ లిప్ట్.
Also Read: Car Offers : భారీగా ఆఫర్లను ప్రకటించిన కార్లు కంపెనీలు.. రూ.లక్ష వరకూ తగ్గింపు.. త్వరపడండి
హారియర్ ఫేస్ లిప్ట్ వెర్షన్ 2023లో మార్కెట్లోకి వచ్చింది. ఇందులో 10.2 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. 12.2 అంగుళాల టచ్ స్క్రీన్ ను కూడా ఉంది. ఇందులో 10 స్పీకర్ల ఆడియో సిస్టమ్, వెంటలేటెడ్ ప్రంట్ సీట్లు, వెనుక వైపు సన్ బ్లైండ్ వంటి ఫీచర్లు అలరిస్తున్నాయి. ఈ ఎస్ యూవీ ఫేస్ లిప్ట్ ను రూ.15.49 లక్షల నుంచి రూ.24.49 లక్షల వరకు విక్రయిస్తున్నారు. అయితే ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ధర మాత్రం రూ.19.9 లక్షలుగా ఉంది.
Also Read: Auto Industry: 19 శాతం వృద్ధితో అన్ని కోట్లకు చేరుకున్న భారత ఆటో ఇండస్ట్రీ..
హారియర్ కారు ఫేస్ లిప్ట్ లో బెస్ట్ కారుగా నిలిచింది. ఈ కారు గ్లోబల్ NCAP గ్లోబల్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ పొందింది. ఇందులో ఏడు ఎయిర్ బ్యాగులు ఉండడం విశేషం. దీంతో కారులో ఉన్నవారందరూ ఎటువంటి ప్రమాదం అయినా సేప్గా బయటపడే అవకాశం ఉంది. అలాగే ఇందులో 360 డిగ్రీ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు వంటివి ఉన్నాయి. ఇక ఇందులో 11 ఫంక్షన్లతో కూడిన ADAS ఉండడం వల్ల కారు భద్రతను పెంచుతుంది. దీంతో ఇది సేప్టీ కారుగా భావించవచ్చు.