Smartphone Addiction: మొబైల్ వాడుతున్నారంటే చాలు యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ చూడకుండా ఉండటం కష్టమే. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది. ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు ఫోన్లు కూడా ఉంటున్నాయి. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇంట్లో ఉండే పిల్లల చేతిలో కూడా ఫోన్లు ఉంటున్నాయి. ఇక వారు స్నేహితులతో ఆడుకోవడం, కలిసి అల్లరి చేయడం వంటివి మానేసి మొత్తం సమయం ఫోన్ లోనే గడిపేస్తున్నారు. పిల్లలు అల్లరి చేస్తారని, సైలెంట్ గా ఉండాలని తల్లిదండ్రులే వారికి అలవాటు చేస్తున్నారు.
మొబైల్ చూస్తుంటే అందులో మంచితో పాటు చెడు కూడా ఉంటుంది. అయితే చిన్నపిల్లలకు ఫోన్ లో వీడియోలు పెట్టి తల్లిదండ్రులు తమ పని చేసుకుంటారు. ఈ సమయంలో ఎలాంటి వీడియోలు వస్తున్నాయి. ఏ కంటెంట్ వారు చూస్తున్నారు అనే విషయాల గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఏ యాప్స్ ను ఓపెన్ చేసినా సరే అనవసరమైన కంటెంట్, పిల్లలు చూడకూడని వీడియోలు, బ్యాడ్ వీడియోలు ఎక్కువగా వస్తున్నాయి. అవి వారి బాల్యాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి.
మరి పిల్లలు చూస్తున్నప్పుడు మీ ఫోన్ లో అడల్ట్ కంటెంట్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? పిల్లలకు ఇచ్చే మొబైల్ లో యూట్యూబ్ ఓపెన్ చేసి అందులో సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఆ తర్వాత జనరల్ ను క్లిక్ చేసి రిస్ట్రిక్టెడ్ మోడ్ ఆన్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ మొబైల్ లో అనవసరమైన వీడియోలు, అడల్ట్ కంటెంట్, పిల్లలు చూడకూడని కంటెంట్ ఏది కూడా రాదు.
ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు పిల్లలకు ఫోన్ ఇచ్చేటప్పుడు ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటివి ఓపెన్ చేయకుండా చూడండి. ప్రస్తుత సమయంలో మంచి ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యమో.. క్వాలిటీ పేరెంటింగ్ కూడా అంతే ముఖ్యం.