Love: టాకింగ్, చాటింగ్, డేటింగ్ ఇదేనా ప్రేమంటే?

ప్రేమ కాదని తెలిసి కూడా ప్రేమిస్తున్నారు నేటి యువత. యూజ్ అండ్ థ్రో అనే పేరును కూడా వాడేస్తున్నారు. కానీ తాము ఆకర్షణలో ఉన్న వ్యక్తితో ఈ మాట చెప్పకుండా దానికి ప్రేమ అనే ముసుగు వేస్తున్నారు.

Written By: Swathi Chilukuri, Updated On : June 20, 2024 3:04 pm

Love

Follow us on

Love: ఈ కాలంలో ప్రేమ అంటూ యువతరం తమ కర్తవ్యాన్ని కూడా మర్చిపోతుంది. చిన్నతనం నుంచే ఆకర్షణతో ప్రేమ అనుకుంటూ తాము చేయాల్సిన పనులను పక్కన పెడుతున్నారు. స్కూల్ కు వెళ్లే పిల్లలు కూడా దీని మాయలో పడి భవిష్యత్తును ఇరకాటంలో పడేసుకుంటున్నారు. ఇంతకీ నిజమైన ప్రేమ అంటే ఏంటి? నిజంగా మీది ప్రేమనా? అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

ప్రేమ కాదని తెలిసి కూడా ప్రేమిస్తున్నారు నేటి యువత. యూజ్ అండ్ థ్రో అనే పేరును కూడా వాడేస్తున్నారు. కానీ తాము ఆకర్షణలో ఉన్న వ్యక్తితో ఈ మాట చెప్పకుండా దానికి ప్రేమ అనే ముసుగు వేస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్యనే ఈ కాలంలో పెరిగిపోయింది. అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరు కూడా ఇదే తోవలో నడుస్తున్నారు. కానీ ప్రేమలో ఉన్న మాధుర్యం, ప్రేమ పడే తపన, ప్రేమ చూపించే ప్రేమ తెలియక తాత్కాలికమైన కోరికల కోసం శాశ్వతమైన ప్రేమను దూరం చేసుకుంటున్నారు.

ఒకరిని ప్రేమిస్తే వారితో జీవితం గడపాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా భుజం తడుతూ పాలు పంచుకోవాలి. కామ వాంఛ కోసం పెట్టుకునే రిలేషన్ లో ప్రేమ ఉండదు. కానీ మనసుతో ముడిపడే బంధంలో మాత్రమే ప్రేమ ఉంటుంది. మీ భాగస్వామి దగ్గర లేనప్పుడు మీకు పదే పదే గుర్తు వస్తుందంటే మీరు నిజమైన ప్రేమలో ఉన్నట్టే. ఏదైనా గ్రామానికి లేదా చుట్టాల ఇంటికి వెళ్లినప్పుడు మా ఆయన ఈ సమయానికి టీ తాగుతారు అని భార్య, మా భార్య ఉంటే ఈ సమయానికి టీ ఇచ్చేది అని భర్త ఒకరికి ఒకరు గుర్తుచేసుకోవాలి.

ఒకరి మీద ఒకరికి నిజమైన ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఆ బంధం బాగుంటుంది. కానీ నలుగురితో చాటింగ్, ముగ్గురితో టాకింగ్, ఇద్దరితో డేటింట్ అంటూ ఉండే రిలేషన్ లో ప్రేమ ఉండదు. అందుకే మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? మీది నిజమైన ప్రేమనా కాదా? అని తెలుసుకొని ఇకనైనా మీ భవిష్యత్తును మార్చుకోండి. లేదంటే చదువు, ఉద్యోగం అని బిజీ అవ్వండి. ఆ తర్వాత ప్రేమ.. పెళ్లి.. అంటూ లవ్ చేయండి.