Vat Savitri Vrat 2024: భర్త ఆయుష్షు పెరగాలంటే ఈ వ్రతం చేయాలి?

విష్ణువును పూజించడం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, జ్యేష్ఠ మాసంలోని పూర్ణిమ తిథి జూన్ 21, శుక్రవారం ఉదయం 7:32 గంటలకు ప్రారంభమైంది అంటున్నారు పండితులు.

Written By: Swathi, Updated On : June 21, 2024 3:44 pm

Vat Savitri Vrat 2024

Follow us on

Vat Savitri Vrat 2024: పూర్ణిమ తిథిని చాలా మంది జరుపుకుంటారు. ఈ తిథికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు విష్ణువుకు అంకితం చేశారు. ఈ రోజున వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం , వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని వట్ పూర్ణిమ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇదెలా ఉంటే జ్యేష్ట మాసంలో వచ్చే పూర్ణిమ ప్రాముఖ్యత పెరుగుతుంది. ఉత్తర భారతదేశంలో సావిత్రి జ్యేష్ట మాసంలోని అమావాస్య రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వట్ సావిత్రి వ్రతం గురించి, వట్ చెట్టులో త్రిదేవ-బ్రహ్మ, విష్ణు , మహేషుల నివాసం ఉంటారని విశ్వాసం.

విష్ణువును పూజించడం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, జ్యేష్ఠ మాసంలోని పూర్ణిమ తిథి జూన్ 21, శుక్రవారం ఉదయం 7:32 గంటలకు ప్రారంభమైంది అంటున్నారు పండితులు. ఇది జూన్ 22, శనివారం ఉదయం 6:38 గంటలకు ముగియబోతుంది. ఈ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి.. దీని తరువాత స్నానం చేసి సూర్య భగవానుడికి నీరు సమర్పించి వ్రతం చేయాలి అంటున్నారు పండితులు. ఈ రోజున మీరు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులను ధరించాలట.

ఇలా చేసిన తర్వాత ఇంటికి దగ్గర్లో ఉన్న మర్రిచెట్టు వద్దకు వెళ్లాలి. అక్కడ మర్రి చెట్టు వేరుకు నీరు సమర్పించాలి. పూలు, బియ్యం, బెల్లం, నానబెట్టిన శనగలు, స్వీట్లు మొదలైనవి సమర్పించాలి. దీని తర్వాత మర్రి చెట్టు చుట్టూ దారాన్ని చుట్టి ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి. దీని తర్వాత వట్ సావిత్రి కథ వినాలి. చివర్లో నమస్కరించి, పూజ సమయంలో ఏమైనా తప్పులు జరిగితే క్షమించమని అడగాలి. ఈ రోజున మీ శక్తికి తగ్గట్టు దానం చేయాలి అంటున్నారు పండితులు.

ఈ ప్రత్యేకమైన రోజుకు ఓ ప్రత్యేకమైన పురాణం కూడా ఉంది. అయితే అశ్వపతి రాజు కుమార్తె సావిత్రి. ఈమె చాలా అందంగా ఉంటుంది. అందం మాత్రమే కాదు గుణవంతురాలు కూడా. ఈమెకు సత్యవాన్ అనే యువకుడితో పెళ్లి జరుగుతుంది.ఈయన కూడా భగవంతుని భక్తుడే. ఇదిలా ఉండగా సావిత్రికి తన భర్త ఆయుష్షు తక్కువగా ఉంటుందని తెలిస్తుంది. భర్త ఆయుష్షు పెరగాలని తీవ్రమైన తపస్సు చేస్తుంది సావిత్రి. ఒకరోజు భర్త సత్యవాన్ ప్రాణాన్ని తీయడానికి యమరాజు వస్తాడు. తన తపస్సు , పవిత్రత శక్తితో ఆమె భర్తను తిరిగి బ్రతికించమని యమరాజును వేడుకుంటుంది సావిత్రి. ఆమె కోరిక మన్నిస్తాడట. ఇలా భర్త ఆయుష్షు కోసం వట్ సావిత్రి పూర్ణిమ నాడు ఉపవాసం ఉంటూ పూజలు చేస్తారు భక్తులు.