Gold Price: ఇతర దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలో బంగారంను ఇష్టపడే వాళ్ల సంఖ్య ఎక్కువనే విషయం తెలిసిందే. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,000 రూపాయలకు అటూఇటుగా ఉంది. అయితే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో బంగారం ధరలు అంతకంతకూ పెరిగే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కేడియా అడ్వయిజరీ డైరెక్టర్ అజయ్ కేడియా చెబుతున్న వివరాల ప్రకారం ఇదే పరిస్థితులు నెలకొంటే బంగారం ధర 60,000 రూపాయలకు చేరే ఛాన్స్ ఉంది.
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం వల్ల బంగారంతో పాటు ఇతర ముఖ్యమైన వస్తువుల ధరలు, నిత్యావసరాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం వల్ల ఇన్వెస్టర్లు టెన్షన్ పడుతున్నారు. అయితే ఇదే సమయంలో బంగారంపై ఇన్వెస్ట్ చేసేవాళ్ల సంఖ్య మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం వల్ల బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి.
Also Read: వివేకా హత్య కేసులో కొత్తకోణాలు.. ముమ్మరంగా సీబీఐ దర్యాప్తు
నేచురల్ గ్యాస్ ధరలు, అల్యూమినియం ధరలు కూడా పెరుగుతుండటం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం ధరలు పెరిగే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వచ్చే నెల చివరినాటికి బంగారం ధర 53,500 రూపాయలకు చేరే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది. బంగారానికి భవిష్యత్తు బాగుంటుందని నిపుణులు భావిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే ఆలోచన ఉంటే మాత్రం వెంటనే కొనుగోలు చేస్తే మంచిది.
బంగారం, వెండి ధరలు ఎంత పెరుగుతాయో కచ్చితంగా అంచనా వేయలేమని నిపుణులు భావిస్తున్నారు. ఏడాది కాలంగా బంగారం ధరలలో పెద్దగా మార్పు లేదు. అయితే బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని వస్తున్న వార్తలు కొనుగోలు చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లను టెన్షన్ పెడుతున్నాయి.
Also Read: ‘భీమ్లానాయక్’కు చంద్రబాబు, లోకేష్ సపోర్టు.. జూ.ఎన్టీఆర్, బాలకృష్ణను లాగి కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని
Recommended Video: