Pawan Kalyan Fans and AP Ministers: ఆంధ్రప్రదేశ్ లో భీమ్లానాయక్ సినిమా విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోంది. దీంతో పవన్ కల్యాణ్ అభిమానుల్లో ఆగ్రహం పెరిగిపోతోంది. ప్రభుత్వ నిర్వాకంతో నిరసన గళం విప్పుతున్నారు. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న అభిమానులు ఒక్కసారిగా రెచ్చిపోతున్నారు. సినిమా రంగాన్ని నిర్వీర్యం చేసే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అయినా ప్రభుత్వ మొండివైఖరిపై అందరిలో కూడా ఆగ్రహావేశాలు వస్తున్నాయి.
ఈ క్రమంలో గుడివాడలో ఓ సినిమా థియేటర్ ప్రారంభోత్సావానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని రావడంతో పవన్ అభిమానులు ఆయనను అడ్డుకున్నారు. ప్రభుత్వ విధానాన్ని నిరసించారు. జగన్ ప్రభుత్వం అవలంభిస్తోన్న తీరును ఆక్షేపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం తెలిసిందే. దీంతో ఏపీలో సినిమా పరిశ్రమ బతికి బట్టకుండా చేయడానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సినిమా పరిశ్రమను నిర్లక్ష్యం చేస్తోందని సమాచారం.
Also Read: భీమ్లానాయక్‌ను ముప్పు తిప్పలు పెడుతున్న జగన్ సర్కార్.. చాలా చోట్ల థియేటర్లు క్లోజ్
మంత్రులు కొడాలి నాని, పేర్నేని నాని కూడా సినిమా రంగంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. జగన్ విధానమే సరైందని చెబుతూ సినిమా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో మంత్రులను అడ్డుకునేందుకు వచ్చిన పవన్ కల్యాణ్ అభిమానులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో వారు ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు.
సినిమా పరిశ్రమ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమే విమర్శలకు తావిస్తోంది. చిన్న సినిమాలు మాత్రం బతికి బట్టకట్టే అవకాశం లేదు. మొత్తానికి నిరసన సెగలు తాకడంతో మంత్రులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ కల్యాణ్ అభిమానులు రెచ్చిపోయి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా జగన్ ప్రభుత్వం నిలదొక్కుకుంటుందా లేక భారీ నష్టాలను మూటకట్టుకుంటుందా తెలియడం లేదు.
Also Read: రికార్డులన్నీ బద్దలైపోవాలి.. భీమ్లానాయక్ మీద బండ్ల గణేశ్ కామెంట్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే