https://oktelugu.com/

Eating: భోజనం చేసేటప్పుడు.. పాటించాల్సిన నియమాలివే!

భోజనం కేవలం కింద కూర్చోని మాత్రమే చేయాలని వైద్యులు చెబుతున్నారు. ఇలా తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. కింద కూర్చుని తినడం వల్ల ఆహారంపై పూర్తిగా దృష్టి పెట్టగలరు. అలాగే మనస్సు ప్రశాంతంగా ఉండటంతో పాటు రక్త ప్రసరణ జరుగుతుంది.

Written By:
  • Neelambaram
  • , Updated On : August 16, 2024 / 02:41 AM IST

    Eating

    Follow us on

    Eating: మనిషికి తిండి, బట్ట, గూడు తప్పనిసరి. ఈ మూడింట్లో ఏ ఒక్కటి లేకపోయిన జీవించడం కష్టం. తిండి అనే ప్రతి జీవికి ముఖ్యమైనది. సాధారణంగా మానవులు రోజుకి మూడు పూటలు ఆహారం తీసుకుంటారు. వీటిని కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. కానీ వీటిని ఎవరూ పాటించరు. ప్రస్తుతం ఉన్న ఫ్యాషన్ ప్రపంచంలో చాలామంది కింద కూర్చోని భోజనం చేయకుండా డైనింగ్ టేబుల్, మంచం మీద కూర్చుని తింటుంటారు. భోజనం నేల మీద కూర్చోని తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. కానీ చాలామంది డైనింగ్ టేబుల్‌ మీద కూర్చోని తింటుంటారు. ఇలా కూర్చీ లేదా మంచం మీద కూర్చోని తినడం వల్ల లాభాలు లేవు కానీ నష్టాలే ఎక్కువ ఉన్నాయని వైద్యలు అంటున్నారు. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో చాలామంది నిల్చోని, మంచం మీద తినేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. స్కూల్‌కి టైమ్ అవుతుందని, ఆఫీస్‌కి టైమ్ అవుతుందని నిల్చుని తొందరగా తినడం మానండి. ఎంత బిజీగా ఉన్నా కాస్త ప్రశాంతంగా కూర్చోని తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

    భోజనం కేవలం కింద కూర్చోని మాత్రమే చేయాలని వైద్యులు చెబుతున్నారు. ఇలా తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. కింద కూర్చుని తినడం వల్ల ఆహారంపై పూర్తిగా దృష్టి పెట్టగలరు. అలాగే మనస్సు ప్రశాంతంగా ఉండటంతో పాటు రక్త ప్రసరణ జరుగుతుంది. భోజనం ఎక్కువగా తినడాన్ని నిరోధిస్తుంది. దీనివల్ల ఊబకాయం అదుపులో ఉంటుంది. నేలపై కూర్చుని తినడంవల్ల వెన్నెముకకు బలం పెరుగుతుంది. భోజనం చేయడానికి ఒక క్రమపద్ధతి ఉంటుందని వాటిని తప్పకుండా అనుసరించాలి. తినడానికి కూర్చునే ముందు కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోవాలి. తూర్పు లేదా ఉత్తరం కూర్చోని మాత్రమే తినాలి. భోజనం చేసేటప్పుడు మధ్యలో లేవకూడదు. మాట్లాడకూడదు. తినేటప్పుడు మధ్యలో లేచి ఎంగిలి చేతితో ఎవరికీ వడ్డించకూడదు. కొంతమంది ప్లేట్‌ను ఒడిలో పెట్టుకుని తింటారు. ఇలా ప్లేట్ ఒడిలో పెట్టుకుని కూర్చుని తినకూడదు.

    చాలామంది ఈరోజుల్లో బెడ్ మీద కూర్చోని తింటారు. కింద కూర్చోవడం ఇష్టం లేకపోవడం లేదా బద్దకంతో బెడ్ మీద కూర్చొంటారు. ఇలా తినడం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణులు చెబుతున్నారు. బెడ్ మీద కూర్చోని తినడం వల్ల పరిశుభ్రత సమ్యలు, అలర్జీలు, నిద్ర సమస్యలు, దంత క్షయం, ఉబ్బరం వంటివి వస్తాయని వైద్యులు అంటున్నారు. కొందరు ఏకాగ్రత కోల్పోవడం, చురుకుదనం కోల్పోతారు. బెడ్ మీద తినడం వల్ల పరుపుపై తినే పదార్థాలు కొన్నిసార్లు పడతాయి. దీంతో చీమలు, అలెర్జీలు వస్తాయి. భోజనం చేసిన తర్వాత చాలామంది గిన్నెలను ఖాళీ చేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఇంటికి దరిద్రం చుట్టుకుంటుందట. కనీసం కొంచెం అయిన ఆ పాత్రలో మిగిలినట్లు ఉంచాలని మన పెద్దలు చెబుతున్నారు.