Heart Patients Breakfast: ఆధునిక కాలంలో చిన్న వయసులోనే గుండెజబ్బులు పలకరిస్తున్నాయి. నలభై ఏళ్లకే హార్ట్ సమస్యలు వేధిస్తున్నాయి. హాయిగా నూరేళ్లు జీవించాల్సిన మనకు ఇంత చిన్న వయసులో ఈ సమస్యలు రావడానికి మూల కారణం మనం తీసుకునే ఆహారం ఒకటి. వ్యాయామాలు లేకపోవడం రెండోది. ప్రస్తుత పరిస్థితుల్లో అందరు కూర్చుండి చేసే పనులే ఎంచుకుంటున్నారు. ఫలితంగా చేతులు, కాళ్లు కదపడమే మనం చేసే పని. దీంతో అవయవాలు బద్దకిస్తున్నాయి. ఫలితంగా గుండెజబ్బులు సమస్యలు తెస్తున్నాయి. చిన్న వయసులోనే పెద్దప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తోంది. అయినా ఎవరు కూడా లెక్కచేయడం లేదు. మన నిర్లక్ష్యమే మనకు శత్రువుగా మారుతోంది. మనం తీసుకునే ఆహారం కూడా మనకు ప్రధాన ఆటంకంగా మారుతోంది.

గుండెజబ్బులు వచ్చిన వారు కచ్చితమైన డైట్ ను తీసుకోవాల్సిందే. గుండె జబ్బులను తగ్గించే దివ్య ఔషధంగా ఓట్స్ ను తీసుకోవచ్చు. ప్రతి రోజు ఆహారంలో ఓట్స్ ను చేర్చుకుంటే ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ ను తీసుకుంటే గుండెకు ఎంతో హాయి కలుగుతుంది. ఇందులో ఉండే పోషకాలు గుండెను మంచిగా పనిచేయిస్తాయని తెలుస్తోంది. ఓట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలో కొవ్వును తగ్గిస్తాయని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. శరీరంలో ఆరోగ్యకరమైన కణాలను తయారు చేయడానికి మంచి కొలెస్ట్రాల్ అవసరమే. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొలెస్ట్రాల్ లెవల్స్ తక్కువగా ఉండాలి. లేకపోతే గుండెజబ్బు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఓట్స్ లో ఉండే ఫైబర్ తో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి మనకు సాయపడుతుంది.
Also Read: Srihari- Dookudu Movie: రియల్ స్టార్ శ్రీహరి ‘దూకుడు’ సినిమాని వదులుకోవడానికి కారణం ఏమిటో తెలుసా?
ప్రతి వంద గ్రాముల వండని ఓట్స్ లో 3990 కేలరీల శక్తి, 66 గ్రాముల కార్బొహైడ్రేడ్లు, 11 గ్రాముల ఫైబర్, 47 గ్రాముల ప్రొటీన్లు, 7 గ్రాముల కొవ్వుతోపాటు విటమిన్ బి1 విటమిన్ బి5లు పుష్కలంగా ఉంటాయి. ఐరన్, మాంగనీస్, మెగ్నిషియం, పాస్పరస్ వంటి ఖనిజాలు కూడా ఉండటం వల్ల ఓట్స్ ను మన ఆహారంలో చేర్చుకోవడం మంచిదే అని తెలుసుకోవాలి. ఓట్స్ మధుమేహులకుకూడా మేలు చేస్తాయి. వీటిని తీసుకో వడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. పిల్లల్లో వచ్చే ఆస్తమాను కూడా ఇవి తగ్గిస్తాయి. అందుకే ఓట్స్ ను ఉదయం పూట అల్పాహారంలో చేర్చుకుంటే మంచి ఫలితాలు వస్తాయనడంలో సందేహం లేదు.

ఓట్స్ తో రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. గుండెపోటు ప్రభావాన్ని తగ్గిస్తుంది. రక్తప్రసరణ సరిగా జరిగేలా చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఓట్స్ ను తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని గ్రహించుకోవాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ మన దేహానికి రక్షణ కలిగిస్తాయి. ఓట్స్ ను రోజు తీసుకుంటుంటే మన దేహం మంచిగా తయారవుతుంది. రోగాలు రాని దేహం కోసం ఓట్స్ ను విరివిగా తీసుకుని వ్యాధుల నుంచి రక్షణ పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రొమ్ము క్యాన్సర్ ముప్పు రాకుండా నిరోధిస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇలా ఓట్స్ తో మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు నిండి ఉండటంతో ఓట్స్ ను తీసుకుని మన ప్రాణాలను కాపాడుకోవాలని వైద్యులు చెబుతున్నారు.