Morning Walk: ప్రతి రోజు ఉదయం లేచిన తరువాత కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కొందరు లేస్తూనే బద్ధకంగా ఉంటారు. రోజంతా నిట్టూర్పులు విరుస్తుంటారు. ఆవలింతలు చేస్తుంటారు. దీంతో పక్కన ఉన్న వారికి కూడా అదే బద్ధకం ఆవహిస్తుంది. రోజంతా హుషారుగా, యాంగ్జయిటీగా ఉండాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా కూర్చుండి ఉద్యోగాలు చేసేవారికి కచ్చితంగా అవసరమే. కానీ బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంటారు. కాళ్లు, వేళ్లు కదపకుండా కాలం వెళ్లదీస్తుంటారు. ఇటువంటి వారితో ప్రమాదమే. వారితో ఎవరికో కాదు వారికే నష్టం. రోగాలు దరిచేరడానికి ప్రధాన వనరుగా మారతారు. దీంతో వందేళ్లు హాయిగా ఉండాల్సిన శరీరం యాభై ఏళ్లకే టపా కట్టేస్తుంది.

ఇలాంటి నష్టాలు రాకుండా ఉండాలంటే మనం అప్రమత్తంగా ఉండాల్సిందే. నిద్ర లేచిన తరువాత కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం నడక సాగించాల్సిందే. రోజుకు కనీసం నలభై అయిదు నిమిషాల నుంచి గంట వరకు నడవాలి. లేదంటే మన శరీరం బద్ధగిస్తుంది. ఫలితంగా అవయవాలు కూడా బద్దకంగా మారితే రక్తప్రసరణ ఆగి లేనిపోని రోగాలు అంటుకుంటాయి. మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు ఇలా ఒకటేమిటి అన్ని మనకు మంచి మిత్రులుగా మారిపోతాయి. దీంతో మన శరీరం ఎన్నో అవస్థలు పడాల్సిందే.
Also Read: Srihari- Dookudu Movie: రియల్ స్టార్ శ్రీహరి ‘దూకుడు’ సినిమాని వదులుకోవడానికి కారణం ఏమిటో తెలుసా?
నడక కొనసాగిస్తే చాలా మటుకు రోగాల నుంచి బయట పడే అవకాశాలుంటాయి. నడకతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండెజబ్బుల ముప్పు కూడా ఉండదు. అందుకే ఉదయం పూట నడకకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎంత సమయం కేటాయించి మనం నడక సాగిస్తామో మనకు అంత ప్రయోజనం దక్కడం ఖాయం. వైద్యులు కూడా అదే చెబుతున్నారు. ప్రతిరోజు నడవాలని సూచిస్తున్నారు. అయినా కొందరు పెడచెవిన పెడుతున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు నడక మరింత మంచిదే.

ఆధునిక కాలంలో కూర్చుండి చేసే ఉద్యోగాలే ఉండటంతో మనిషికి వాకింగ్ అత్యవసరం. దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇక మనకు రోగాలు రావడం ఖాయం. మనదేహానికి మంచి చేసే నడకను నిర్లక్ష్యం చేస్తే మనకు అనర్థాలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది. అందుకే ఉదయం పూట నడవడానికి ముందుకు రావాలి. ప్రతి రోజు నడిచి మన దేహానికి ఎలాంటి బాధలు లేకుండా చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. హాయిగా జీవించే ఆస్కారం ఎంతగా ఉన్నందున వాకింగ్ చేయండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.