Mahesh Babu Mother Indira Devi: సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి తన తల్లి ఇందిరమ్మ గారు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..తన తల్లి గురించి మాట్లాడేటపుడల్లా మహేష్ బాబు కళ్ళలో నీళ్లు తిరగడం మనం ఎన్నో సార్లు గమనించి ఉంటాము..ఆయనకీ తన తల్లి గారితో ఉన్న అనుబంధం మరియు ప్రేమ అలాంటిది..అలాంటి తల్లికి ఈరోజు కాస్త ఆరోగ్యం సీరియస్ అవ్వడం తో AIG హాస్పిటల్స్ లో చేర్చారు..ప్రస్తుతం ఎమెర్జెనీ వార్డులో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు..ఇందిరమ్మ గారికి ౭౯ ఏళ్ళు వచ్చాయి..ఈమె కృష్ణ గారిని 1961 వ సంవత్ర్సం లో పెళ్లి చేసుకున్నారు..మహేష్ బాబు తో పాటు రమేష్ బాబు మరియు మంజుల కి జన్మని ఇచ్చారు ఇందిరమ్మ గారు..ఇక ఆ తర్వాత కృష్ణ గారు 1969 సంవత్సరం లో విజయ నిర్మల గారిని రెండవ పెళ్లి చేసుకున్నారు..విజయ నిర్మల గారిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇందిరమ్మ గారితో దాంపత్య జీవితం కొనసాగించారు కృష్ణ గారు..విజయ నిర్మల గారు కృష్ణ గారి సినిమాల వ్యవహారాలు మరియు కృష్ణ గారికి సంబంధించిన అన్నీ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకునేవారు..విజయ నిర్మల గారు 2019 వ సంవత్సరం లో చనిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే.

విజయ నిర్మల గారు చనిపోవడం తో కృష్ణ గారు బాగా కృంగిపోయారు..ఈ బాధ నుండి పూర్తిగా తేరుకునేలోపే కృష్ణ గారి పెద్ద కుమారుడు రమేష్ బాబు గారు ఇటీవలే కన్నుమూశారు..కృష్ణ గారితో పాటు ఘట్టమనేని కుటుంబం మొత్తానికి ఇది కోలుకోలేని దెబ్బ..ఇప్పుడు ఇందిరమ్మ గారి ఆరోగ్యం కూడా క్షీణించడం తో మహేష్ బాబు అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

అయితే భయపడాల్సిన అవసరం ఏమి లేదని..త్వరలోనే ఆమె కోలుకుంటారని..ఆమె కోలుకోవడానికి అభిమానులందరూ ఆ దేవుడికి ప్రార్థన చెయ్యాలని కృష్ణ గారి సన్నిహిత వర్గాలు చెప్తున్నారు..ప్రస్తుతం మహేష్ బాబు గారు AIG హాస్పిటల్స్ దగ్గరే ఉన్నాడు..ఇందిరా దేవి గారు త్వరగా కోలుకోవాలని..ఆమె కోలుకొని నిండు నూరేళ్లు ప్రశాంతం గా బ్రతకాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాము.