Srihari- Dookudu Movie: రియల్ స్టార్ శ్రీహరి ‘దూకుడు’ సినిమాని వదులుకోవడానికి కారణం ఏమిటో తెలుసా?
Srihari- Dookudu Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయిన చిత్రం దూకుడు..శ్రీను వైట్ల దర్శకత్వం లో 14 రీల్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకి మహేష్ బాబు గారి అన్నయ్య రమేష్ బాబు సమర్పకులుగా వ్యవహరించారు..అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ఇప్పటికి ఎవ్వరు మర్చిపోలేరు..పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మహేష్ బాబు కి వరుసగా […]

Srihari- Dookudu Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయిన చిత్రం దూకుడు..శ్రీను వైట్ల దర్శకత్వం లో 14 రీల్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకి మహేష్ బాబు గారి అన్నయ్య రమేష్ బాబు సమర్పకులుగా వ్యవహరించారు..అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ఇప్పటికి ఎవ్వరు మర్చిపోలేరు..పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మహేష్ బాబు కి వరుసగా మూడు భారీ డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు వచ్చాయి..మహేష్ ఆ సమయం లో మానసికంగా చాలా కృంగిపోయాడు..ఎంతో ఇష్టపడి చేసిన ఖలేజా సినిమా భారీ డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో 6 నెలల పాటు ఆయన ఇంట్లో నుండి బయటకి రాలేదు..ఎవ్వరిని కలవడానికి కూడా ఆయన ఇష్టపడలేదు..ఆ సమయం లో శ్రీను వైట్ల వచ్చి ఈ కథ చెప్పగానే ఎంతగానో నచ్చి వెంటనే డేట్స్ ఇచ్చేశాడట మహేష్..అలా తెరెకక్కినా ఈ సినిమా విడుదలై నేటికీ 11 సంవత్సరాలు పూర్తి అయ్యాయి..ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి ఎవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయ్యి బాగా వైరల్ అయ్యింది.

Srihari
ఈ సినిమా తండ్రి సెంటిమెంట్ ని ఆధారంగా తీసుకొని తెరకెక్కిన సంగతి మన అందరికి తెలిసిందే..బ్రహ్మానందం మరియు MS నారాయణ పండించిన అద్భుతమైన కామెడీ వల్లే ఈ సినిమా అంత పెద్ద హిట్ అయ్యినప్పటికీ..తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధం..దాని నుండి పుట్టిన సెంటిమెంట్ మరియు ఎమోషన్స్ ఈ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లేలా చేసింది..ఇందులో మహేష్ బాబు తండ్రి గా ప్రకాష్ రాజ్ ఎంతో అద్భుతంగా నటించారు..వాస్తవానికి ఈ పాత్ర కోసం తొలుత రియల్ స్టార్ శ్రీహరి గారిని అనుకున్నారట..కానీ తండ్రి పాత్ర అవ్వడం తో ఆయన చెయ్యను అని చెప్పాడట.

Dookudu Movie
అప్పటికే శ్రీహరి గారితో శ్రీను వైట్ల ఢీ,కింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసాడు..మంచి అనుబంధం కూడా ఉంది వీళ్లిద్దరి మధ్య..కానీ ఆ పాత్ర కి తానూ సరిపోనని..దానిని మహేష్ కి అన్నయ్య పాత్ర గా మారిస్తే కచ్చితంగా చేస్తాను అని చెప్పాడట..కానీ కథ మార్చడానికి కుదర్లేదు..దీనితో మహేష్ బాబు సూచన మేరకు ఆ పాత్రకి ప్రకాష్ రాజ్ ని తీసుకున్నారు..అప్పట్లోనే 56 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ లో తెలుగు సినిమా సత్తా చాటింది..అక్కడ ఈ సినిమా దాదాపుగా 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది..టాలీవుడ్ మొట్టమొదటి 1 మిలియన్ సినిమా కూడా ఇదే..అలా ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఈ సినిమా వచ్చి 11 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ అభిమానులు సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తున్నారు.
