Samantha Shaakuntalam: ఆ డైరెక్టర్ ఫేట్ డిసైడ్ చేయనున్న సమంత.. రిలీజ్ డేట్ వచ్చేసింది, రిజల్ట్ పైనే అందరి దృష్టి!
Samantha Shaakuntalam: దాదాపు ఏడేళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టాడు దర్శకుడు గుణశేఖర్. ఆయన గత చిత్రం రుద్రమదేవి 2015 లో విడుదలైంది. అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన పీరియాడిక్ మూవీ రుద్రమదేవి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. అలా అని పూర్తిగా నిరాశపరచలేదు. వసూళ్ల పరంగా పర్వాలేదు అనిపించుకుంది.గుణశేఖర్ 2019లో రాణాతో ‘హిరణ్య కశిప’ ప్రకటించారు. చాలా వరకు ప్రీప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. కానీ ఆ ప్రాజెక్ట్ […]

Samantha Shaakuntalam: దాదాపు ఏడేళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టాడు దర్శకుడు గుణశేఖర్. ఆయన గత చిత్రం రుద్రమదేవి 2015 లో విడుదలైంది. అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన పీరియాడిక్ మూవీ రుద్రమదేవి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. అలా అని పూర్తిగా నిరాశపరచలేదు. వసూళ్ల పరంగా పర్వాలేదు అనిపించుకుంది.గుణశేఖర్ 2019లో రాణాతో ‘హిరణ్య కశిప’ ప్రకటించారు. చాలా వరకు ప్రీప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. కానీ ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టి సమంతతో శాకుంతలం టైటిల్ మైథలాజికల్ మూవీ ప్రకటించాడు.

Samantha
ఈ సినిమా షూటింగ్ చకచకా పూర్తి చేసిన గుణశేఖర్ పోస్ట్ ప్రొడక్షన్ కి నెలల సమయం కేటాయిస్తున్నారు. పౌరాణిక గాథ నేపథ్యంలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. మలయాళ హీరో దేవ్ మోహన్ సమంతకు జంటగా నటిస్తున్నారు. ఈ మూవీలో సమంతదే ప్రధాన రోల్. సమంత నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అని కూడా చెప్పొచ్చు. కాగా శాకుంతలం మూవీ విడుదల తేదీ ప్రకటించారు. 2022 నవంబర్ 4న శాకుంతలం వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల కానుంది.
ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. అబ్బురపరిచే రాజప్రసాదాలతో కూడిన మోషన్ పోస్టర్ విడుదల చేశారు. సమంత, దేవ్ మోహన్ రొమాంటిక్ ఫోజ్ కట్టిపడేస్తుంది. శాకుంతలం మూవీని దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఒక్కడు మూవీతో బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టిన గుణశేఖర్ నుండి ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ రాలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన సైనికుడు, వరుడు, నిప్పు లాంటి చిత్రాలు నిరాశపరిచాయి.

Samantha
ఈ క్రమంలో సొంత నిర్మాణ సంస్థలో శాకుంతలం తెరకెక్కిస్తున్నారు. శాకుంతలం రిజల్ట్ పైనే రానాతో చేయాలనుకుంటున్న హిరణ్య కశిప భవిష్యత్ ఆధారపడి ఉంది. ఒకవేళ శాకుంతలం అంచనాలు అందుకోకపోతే రానా గుణశేఖర్ తో మూవీ చేయడానికి ఆసక్తి చూపకపోవచ్చు. కాబట్టి సమంత దర్శకుడు గుణశేఖర్ ఫేట్ డిసైడ్ చేయనుంది. శాకుంతలం చిత్రానికున్న మరొక ప్రత్యేకత అల్లు అర్జున్ కూతురు అర్హ బాలనటిగా ఎంట్రీ ఇస్తుంది. అలాగే వకీల్ సాబ్ ఫేమ్ అనన్య నాగళ్ళ, బిగ్ బాస్ బ్యూటీ నందినాయ్ నటిస్తున్నట్లు సమాచారం.