RBI New Rules: అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆర్థిక నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. దీంతో డెబిట్, క్రెడిట్ కార్డుల ఆన్ లైన్ చెల్లింపులకు సంబంధించి కొత్త రూల్స్ మారబోతున్నాయి. ఆర్బీఐ ప్రతిపాదిత సీవోఎఫ్ (కార్డ్-ఆన్-ఫైల్ ) టోకెనైజేషన్ విధానం అమల్లోకి వస్తోంది. టోకెనైజేషన్ తో వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. గతంలో జూలై నుంచే ఈ విధానం అమల్లోకి తీసుకురావాలని భావించినా పలు కారణాలతో అక్టోబర్ 1కి వాయిదా వేసింది. దీంతో ఆర్బీఐ నిర్దేశిత వివరాల ప్రకారం నిబంధనలు విధించనున్నారు.

కార్డు వివరాలతో ప్రత్యామ్నాయంగా రూపొందించే కోడ్ నే టోకెన్ గా పిలుస్తారు. టోకెన్ జారీ చేసే సంస్థ టోకెన్ రిక్వెస్టర్ అందుబాటులోకి తీసుకొచ్చే యాప్ ద్వారా టోకెనైజేషన్ కోసం వినియోగదారులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్వెస్ట్ ను కార్డు నెట్ వర్క్ కు పంపుతారు. దీంతో కార్డు హోల్డర్ ఎలాంటి చార్జీలు చెల్లించే అవకాశం ఉండదు. ఇకపై కార్డు వివరాలు కాకుండా టోకెన్ వివరాలు మాత్రమే సేవ్ అయ్యే అవకాశం ఉంది. టోకెనైజేషన్ విదానంలో ఒక కస్టమర్ ఒక చెల్లింపునకు సంబంధించి తన కార్డులను రిజిస్టర్ లేదా డీరిజిస్టర్ చేసుకోవడం మన ఇష్టమే.
డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలతో ప్రత్యామ్నాయంగా రూపొందించే కోడ్ న టోకెన్ అని పిలుస్తారు. డెబిట్, క్రెడిట్ కార్డు నంబర్లు డిజిటల్ గా మారుతాయి. కొత్త నిబంధనల ప్రకారం వ్యాపారులు, వినియోగదారులు తమ వివరాలను సర్వర్ల నుంచి తొలగిస్తారు. ఆన్ లైన్ లో చెల్లింపులు జరిపే వినియోగదారులు తరచుగా ఉపయోగించే ఈ కామర్స్ సైట్లు, ఫుడ్ డెలివరీ యాప్ లలో తమ కార్డు వివరాలు నిక్షిప్తం చేసుకుంటారు. సర్వర్ హ్యాకింగ్ కు గరైతే కార్డు వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉన్నందున ఆ ముప్పులను తప్పించుకునేందుకు కొత్త టోకెనైజేషన్ తోడ్పడుతుందని తెలుస్తోంది.

ఈ విధానంలో వినియోగదారులు కార్డు వివరాల టోకెన్ ను క్రియేట్ చేసుకోవాలి. సంబంధిత సంస్థ డివైజ్ ఆధారంగా కంపెనీ కొత్త టోకెన్ ను జారీ చేస్తుంది. ఈ టోకెన్ లోనే కార్డు వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. దీంతో టోకెన్ తో ఈ కామర్స్ సైట్, ఫుడ్ డెలివరీ యాప్ లాంటి ఒక ప్లాట్ ఫాంపై పలుమార్లు చెల్లింపులు జరుపుకోవచ్చు. దీంతో ఇకపై వినియోగదారులకు ఎలాంటి భయాలు అక్కర్లేదు. దీంతో డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారులు సౌకర్యార్థం రిజర్వ్ బ్యాంకు పలు మార్గదర్శకాలను విడుదల చేయనుంది. దీంతో ఇకపై మోసాలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
Also Read:Janasena Chief Pawan Kalyan: ఆ ముగ్గురు నేతల కోసం పవన్ కల్యాణ్ భారీఫైట్‌కు రెడీ?