Rat Removal Tips: ఎలుకలు ఉన్నాయా? ఈ మొక్కలను పెంచుకోండి.. ఛంగో బిల్లా అంటూ పరుగెత్తిపోతాయి..

లావెండర్ ను పెంచినా సరే ఇంట్లోకి ఎలుకలు రావు. అంతేకాకుండా దీని నుంచి వచ్చే సువాసన ఎలుకలను పారిపోయేలా చేస్తుందట. అంతేకాకుండా ఈ లావెండర్ చిన్న మొక్కను ఇంటి ముందు నాటడం వల్ల కూడా బొద్దింకలు రాకుండా ఉంటాయట. అలాగే దీని నుంచి వచ్చే కొన్ని మూలకాలు ఎలకలను పూర్తిగా ఇంటి పరిసర ప్రాంతాల్లోకి రాకుండా కూడా చేస్తాయట. ఎలుకలను తరిమి వేయడం మాత్రమే కాదు మరిన్ని ప్రయోజనాలు ఎక్కువే ఉన్నాయి.

Written By: Swathi Chilukuri, Updated On : October 27, 2024 4:13 pm

Rat Removal Tips

Follow us on

Rat Removal Tips: ఎలక మామలు చాలా మంది ఇంట్లో కామన్ గా కనిపిస్తుంటాయి. అయితే ఇవి ఉండడం వల్ల వచ్చే సమస్యలు మాత్రం చాలా ఉంటాయి కదా .. ముఖ్యంగా కిచెన్ లో ఉండే వస్తువులను కోరికేస్తుంటాయి ఈ ఎలుకలు. అల్మారులోకి దూరి కొత్త కొత్త దుస్తులను కూడా కొరికి తింటాయి. వీటికి ఇంట్లోకి రావడానికి పెద్ద కష్టం కాదు. సులభంగా వస్తాయి.. అవి రావడం ఈజీనే. కానీ వెళ్లడం, తరిమి కొట్టడం పెద్ద తలనొప్పి.. చాలామంది ఎలకలను ఇంట్లో నుంచి తరిమికొట్టేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయినప్పటికీ వాటిని వదిలించుకోలేకపోతారు. అంతే కాకుండా కొంతమంది అయితే డబ్బులు ఖర్చు పెట్టి మరి పెస్ట్ కంట్రోల్ వాళ్ళతో వాటిని పట్టిస్తున్నారు. అయినప్పటికీ ఎలుకలు ఇంట్లో నుంచి పోలేకపోతున్నాయి. కానీ ఎలాంటి డబ్బుతో ఖర్చు లేకుండా సింపుల్ గా వాటిని ఇంట్లో నుంచి తరిమి వేయవచ్చు. మరి ఎలా అనుకుంటున్నారా?

అయితే దీని కోసం మీ ఇంటి ముందు ఒక చిన్న చెట్టును పెంచుకుంటే సరిపోతుంది. రోజ్ మేరీ ఆకులు ఉండే చెట్టును ఇంటి ముందు నాటండి. ఇలా చేస్తే ఈ చెట్టు నుంచి వచ్చే సువాసనకు ఎలకలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఆ సువాసన ఇంట్లోకి చేరి ఇంట్లో ఉన్న ఎలకలను కూడా పారిపోయేలా చేస్తాయి. అలాగే ఈ చెట్టు ఉన్న పరిసర ప్రాంతాల్లోకి కూడా సంచారం చెయ్యవట. దీని నుంచి వచ్చే సువాసన వల్ల కూడా ఇతర క్రిమి కీటకాలు తొలగిపోతాయి..

ఇంటి ముందు లావెండర్ ను పెంచినా సరే ఇంట్లోకి ఎలుకలు రావు. అంతేకాకుండా దీని నుంచి వచ్చే సువాసన ఎలుకలను పారిపోయేలా చేస్తుందట. అంతేకాకుండా ఈ లావెండర్ చిన్న మొక్కను ఇంటి ముందు నాటడం వల్ల కూడా బొద్దింకలు రాకుండా ఉంటాయట. అలాగే దీని నుంచి వచ్చే కొన్ని మూలకాలు ఎలకలను పూర్తిగా ఇంటి పరిసర ప్రాంతాల్లోకి రాకుండా కూడా చేస్తాయట. ఎలుకలను తరిమి వేయడం మాత్రమే కాదు మరిన్ని ప్రయోజనాలు ఎక్కువే ఉన్నాయి.

బిర్యానీలోకి వాడుకునే పుదీనా మొక్కలను ఇంటి ముందు నాటడం వల్ల ఎలకలు రాకుండా ఉంటాయట. ఈ ఆకుల నుంచి వచ్చే వాసన ఎలుకలకు ఇరిటేటింగ్ చేస్తుంది. అంతేకాకుండా అక్కడి నుంచి పారిపోయేలా చేసేందుకు కూడా ఆకులు ఎంతగానో సహాయపడతాయట. కాబట్టి ఇంటి గుమ్మం ముందు పుదీనా మొక్కలు కూడా పెంచవచ్చు. దీని వల్ల కూడా మీకు ఎముకల నుంచి విముక్తి లభిస్తుంది.

ఇక బంతిపూలు చాలా మంది ఇంట్లో ఉంటాయి. వీటి వల్ల కూడా ఎలుకలు ఇంట్లోకి రావు.. దీని నుంచి వచ్చే సువాసన ఎలుకలను తరిమికొడుతుంది. కాబట్టి ఇంటి ముందు బంతి పువ్వు చెట్లను నాటడం వల్ల వీటిని అరికట్టవచ్చు. ఇందులో ఉండే కొన్ని మూలకాలు బొద్దింకలను తగ్గించేందుకు కూడా సహాయపడతాయి. ఈ బంతి చెట్టు కూడా కేవలం ఎలుకలకు మాత్రమే కాదు మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది.