Detox Juices: ఈ డిటాక్స్ జ్యూస్‌లు తాగండి.. మధుమేహానికి చెక్ పెట్టండి

మధుమేహం సమస్యను తగ్గించుకోవాలంటే ఆహార విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమస్య పెరిగితే కొన్నిసార్లు ఆరోగ్యానికే ప్రమాదం. అయితే మధుమేహం సమస్యను తగ్గించుకోవాలంటే డైలీ డిటాక్స్ డ్రింక్‌లు తాగాలి. మరి ఆ డిటాక్స్ డ్రింక్‌లు ఏంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

Written By: Kusuma Aggunna, Updated On : October 27, 2024 8:39 pm

Detox juice

Follow us on

Detox Juices: ప్రస్తుతం చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే సరైన డైట్ పాటించాలి. లేకపోతే సమస్య తీవ్రం అవుతుంది. పెద్ద సమస్య కాదని కొందరు ఫీల్ అయిన కూడా షుగర్ ఉంటే ఇతర ఏ సమస్య వచ్చిన పెద్దగానే కనిపిస్తుంది. అయితే తినే ఆహారంలో చక్కెర మోతాదులు ఎక్కువగా ఉంటే తొందరగా మధుమేహం వస్తుంది. ఈ రోజుల్లో ఆహార విషయంలో నియమాలు పాటించకుండా, బయట ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం, సాఫ్ట్ డ్రింక్స్, మద్యపానం, ధూమపానం, ఆర్టిఫిషియల్ షుగర్ వంటివి తీసుకోవడం వల్ల చాలామంది మధుమేహంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ఆహార విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మధుమేహం తీవ్రం అవుతుంది. ఈ సమస్య పెరిగితే కొన్నిసార్లు ఆరోగ్యానికే ప్రమాదం. అయితే మధుమేహం సమస్యను తగ్గించుకోవాలంటే డైలీ డిటాక్స్ డ్రింక్‌లు తాగాలి. మరి ఆ డిటాక్స్ డ్రింక్‌లు ఏంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

 

సొరకాయ జ్యూస్
మధుమేహం పెరగకుండా ఉండాలంటే కూరగాయల జ్యూస్ బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా సొరకాయ జ్యూస్ మధుమేహం ఉన్నవారు తాగాలి. ఈ జ్యూస్‌ను ఉదయం పూట తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. అలాగే ఈ జ్యూస్ వల్ల జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు కూడా రావు.

పాలకూర జ్యూస్
పాలకూరతో మధుమేహాన్ని అదుపులో ఉంచవచ్చు. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో బాగా సహాయపడతాయి. అలాగే పాలకూర జ్యూస్ బరువు ఎక్కువగా పెరగకుండా నియంత్రిస్తుంది. ఈ జ్యూస్‌ను డైలీ లైఫ్‌లో యాడ్ చేసుకోవడం వల్ల కేవలం మధుమేహం సమస్య నుంచి మాత్రమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు.

మునగాకు జ్యూస్
మునగాకు జ్యూస్ శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆకు జ్యూస్‌ను డైలీ తాగడం వల్ల ఈజీగా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు తప్పకుండా ఈ మునగాకు రసాన్ని రోజుకి ఒకసారి అయిన తాగితే ఆరోగ్యానికి మంచిది.

పొట్లకాయ జ్యూస్
డయాబెటిక్ పేషెంట్లు తప్పకుండా పొట్లకాయ జ్యూస్‌ను తాగాలి. తాగడానికి కాస్త చేదుగా అనిపించిన కూడా మధుమేహం అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే పాలీపెప్టైడ్ అనే మూలకం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

ఉసిరి జ్యూస్
ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు, హైపోగ్లైసీమిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. ఖాళీ కడుపుతో ఉదయం పూట ఉసిరి జ్యూస్‌ను తాగడం వల్ల తొందరగా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ జ్యూస్‌ను కూడా డైలీ డైట్‌లో తప్పకుండా యాడ్ చేసుకోండి.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.