Winter: చలికాలం చలికి వేడి వేడి టీ, కాఫీ పడాల్సిందే? మరి అతిగా తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

ఇన్ని రోజులు వర్షాలతో ఇబ్బందులు పడిపోయిన జనాలు కాస్త చలికి గజ గజ వణికిపోతున్నారు. ముఖ్యంగా చలికాలంలో వృద్దులు, చిన్న పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండక తప్పదు. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Written By: Swathi Chilukuri, Updated On : October 27, 2024 3:46 pm

Winter

Follow us on

Winter: చలికాలం వచ్చేసింది. చలి మంటలు వేస్తున్నారా? లేదా సూర్యుడు వచ్చి చాలా సేపు అయినా సరే చెద్దరి కప్పుకొని మరీ పడుకుంటున్నారా? అమ్మ లేవురా లేవురా అన్నా కూడా లేవాలి అనిపించడం లేదు కదా. ఎవరైనా సరే ఈ చలికాలంలో ఎక్కువ సేపు పడుకోవడానికే ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. కానీ అలా చేయవద్దు. ఉదయమే నిద్ర లేవాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే? ఉదయం లేవగానే కాఫీ, టీ అంటున్నారా? చలిలో వేడి వేడిగా టీ పడాల్సిందే అనుకుంటున్నారా? కానీ ఒకటి అయితే సమస్య లేదు. చలి అంటూ కప్పులు కప్పులు లాగిస్తే మాత్రం మీ సంగతి అంతే అంటున్నారు నిపుణులు.

ఇన్ని రోజులు వర్షాలతో ఇబ్బందులు పడిపోయిన జనాలు కాస్త చలికి గజ గజ వణికిపోతున్నారు. ముఖ్యంగా చలికాలంలో వృద్దులు, చిన్న పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండక తప్పదు. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా మందిలో ఇమ్యునిటీ పవర్ సరిగ్గా ఉండదు. దీంతో చలికాలంలో అనేక వ్యాధుల బారిన పడుతుంటారు. జలుబు, ఆయాసం, తిమ్మిర్లు, కాలేయ సంబంధ రుగ్మతలు, జీర్ణక్రియ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. కొంత మంది చలిగా ఉందని అదే పనిగా కాఫీలు, టీలు ఎక్కువ తీసుకుంటుంటారు. కాఫీ, టీ ఉంటేనే ఉదయం అవుతుంది చాలా మందికి. ఉదయం వరకు ఒకే కానీ అంతకు మించి సేవిస్తేనే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని వల్ల అనేక సమస్యలు కల్గుతాయి అంటున్నారు నిపుణులు. టీలు, కాఫీలు తాగడం వల్ల ఆకలి వేయదు.

అయితే శరీరంలో జీవ గడియారం ఉంటుందట. అది సమయానికి కొన్ని సంకేతాలను ఇవ్వడం కామన్ గా జరుగుతుంది. ఉదయం టిఫిన్,లంచ్, ఈవెనింగ్ ఆకలిగా అన్నించడం, రాత్రి పూట ఆకలివేయడం ఈ జీవగడియారం మన శరీరంకు అందించే సంకేతాలే. ఆ సమయంలో కొన్ని కెమికల్స్ శరీరంలో విడుదల అవుతుంటాయి. కానీ కాఫీలు, టీలు తాగుకుంటూ కూర్చుంటే.. ఆకలి చచ్చిపోవడం కామన్. దీని వల్ల శరీరంలో విడుదలైన కెమికల్స్ వల్ల అవయవాల మీద ప్రభావం పడుతుంది. అందుకే చాలా మంది కడుపులో ఏదో మంటగా ఉందంటూ, కడుపులో కాలిపోతుందంటూ అంటారు.

కాఫీలు, టీలు తాగుతుంటే.. నిద్ర ఉండదు. వీటిలోని కారకాలు శరీరానికి హానీ చేస్తాయి. జీర్ణక్రియపై కూడా కొన్నిసార్లు చెడు ప్రభావం చూపిస్తాయి. కాఫీలు, టీల వల్ల కొందరిలో ఒత్తిడి పెరగడం కూడా కామన్. అందుకే ఏదైన అతిగా తీసుకోకుండా నియమిత పరిమాణంలో తీసుకోవడం చేస్తుండాలి. లేదంటే చెడు ప్రభావాల నుంచి బైటపడటం కూడా కష్టమే అంటున్నారు నిపుణులు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..