Protein Rich Foods: ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే మనం ఎంత సంపాదించినా సంపూర్ణ ఆరోగ్యానికి సాటి రాదని అర్థం. అయితే ఈ ఆరోగ్యం సాధ్యం కావాలంటే మనం పరిపూర్ణమైన ఆహారం తీసుకోవాలి. ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు సమపాళ్ళల్లో ఉండాలి. అయితే ప్రోటీన్ల విషయంలో తీసుకునే ఆహారంలో ఇప్పటికీ చాలామందికి అపోహలు ఉంటాయి. చాలామంది తమ శరీరానికి ప్రోటీన్లు అందించేందుకు మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే “అతి సర్వత్రా వర్జయేత్” సామెత లాగా మాంసాహారం ఎక్కువ తీసుకుంటే శరీరానికి మంచిది కాదు. శరీరంలో కొవ్వులు పేరుకుపోయి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఇలాంటప్పుడు ప్రోటీన్లను భర్తీ చేసే కూరగాయలు, పప్పు గింజలను తీసుకోవడం ద్వారా శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అందులో కొవ్వులు ఉండకపోవడంతో శరీరంలో ఎల్డీఎల్ (లో డెన్సిటీ లైపో ప్రోటీన్) పేరుకుపోయే అవకాశం ఉండదు.
ఈ ఆరు కూరగాయలతో శరీరానికి కావలసిన ప్రోటీన్లు
బ్రకోలి…
ఇందులో కావాల్సిన ప్రోటీన్లు ఉంటాయి. కొవ్వుల శాతం తక్కువగా ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్, మాంగనీస్, పొటాషియం, భాస్వరం, విటమిన్ కే, సీ పుష్కలంగా ఉంటాయి.. ఇవి శరీర అభివృద్ధికి అమితంగా తోడ్పడతాయి. ఇందులో గ్లూకోసినోలేట్ లు క్యాన్సర్ ను దరిచేరకుండా తోడ్పడతాయి.
బఠాణీలు..
చిక్కుడు కుటుంబానికి చెందిన ఇవి ప్రోటీన్ ను అధికంగా కలిగి ఉంటాయి. ఇందులో అపరిమితమైన ఫైబర్ ఉంటుంది. బఠాణీల్లో మాంగనీస్, కాపర్, ఫాస్పరస్, ఫోలేట్, జింక్, ఐరన్, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఉదర క్యాన్సర్ ను నిరోధించడంలో ఇది సహాయపడుతుంది. ఇందులో కౌమెస్ట్రాల్ వంటి ఫైటో న్యూట్రియంట్లు క్యాన్సర్ శరీరం దరి చేరకుండా కాపాడతాయి.
కాలే..
ఈ మొక్కలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. దీనిని కూర గానూ,సలాడ్ గానూ వాడొచ్చు. ఇందులో ఫినోలిక్ రసాయనాలు ఉంటాయి జీ, మెగ్నీషియం అధిక మోతాదులో ఉంటాయి. ఇందులో లూటిన్, జియాక్సంతిన్ కూడా ఉంటాయి. ఇవి కంటిశుక్లాన్ని పరిరక్షిస్తూ ఉంటాయి.
స్వీట్ కార్న్..
చాలామంది తీపి మొక్కజొన్నను కూరగాయగా పరిగణించరు. కానీ వృక్షశాస్త్ర పరిభాష ప్రకారం తీపి మొక్కజొన్న అనేది ఒక కూరగాయ. ఇందులో విపరీతమైన ప్రోటీన్లు ఉంటాయి. మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లలో ఇది తొమ్మిది శాతం వరకు అందిస్తుంది..ఇందులో థయామిన్, విటమిన్ సి, బీ6, ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి. శాండ్ విచ్, సూప్ లలో కూడా స్వీట్ కార్న్ ను ఉపయోగించవచ్చు.
కాలీ ఫ్లవర్..
ఇందులో కూడా ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కాలిఫ్లవర్ లో పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ విటమిన్ సి, కె ఐరన్, సినిగ్రీన్ ఉంటాయి..ఇందులో ఉన్న గ్లూకో సినోలేట్ క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది.
బచ్చలి కూర..
ఇందులో కూడా అధికంగా పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లతో పాటు ఏమైనో ఆమ్లాలు శరీర వృద్ధికి తోడ్పడతాయి. విటమిన్ ఏ, కే, సీ వంటి పోషకాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థను కూడా సక్రమంగా పనిచేసేలా చూస్తుంది. ఇవి మాత్రమే కాకుండా బ్రసెల్ మొలకలు కూడా అధిక స్థాయిలో ప్రోటీన్లు కలిగి ఉంటాయి. ఇందులో విటమిన్లు, ఫైబర్ ఉంటాయి.. మెదడు కు కావలసినన్ని పోషకాలు, క్యాన్సర్ నివారణ, రక్త పోటును అదుపులో ఉంచేందుకు దోహదపడతాయి.