Kishore Indukuri Dairy Farm: ఒకప్పుడు వ్యవసాయం దండగ అన్నారు.. పేడ పిసుక్కోవడం నామోషిగా ఫీలయ్యారు.. పల్లెటూరికెళ్లాలంటే భయపడేవారు.. కానీ ఇప్పుడంతా మారిపోతోంది. పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన వారు తిరిగి వస్తున్నారు.. పరాయి దేశం వద్దు.. సొంతూరు ముద్దు అన్న చందంగా.. చాలా మంది పుట్టినింటి గడప తొక్కుతున్నాు. సొంతూరులో ఒకప్పుడు వ్యవసాయం చేస్తే కష్టం తప్ప కాసులు కనిపించవని అని అనుకున్నవాళ్లే ఇప్పుడు ఆ రంగంలో స్థిరపడుతూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇటీవల ఇలాంటి వారి గురించి చాలా స్టోరీలు వినే ఉంటారు. అయితే పాలు అమ్మడం ద్వారానూ కోట్ల రూపాయలు ఆర్జించవచ్చని ఓ వ్యక్తి నిరూపిస్తున్నాడు. ప్రముఖ్ ఇంటెల్ సంస్థలోని ఉద్యోగాన్ని వదిలీ పేడ పాల వ్యాపారం చేయడానికి వచ్చిన ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఆయన సక్సెస్ స్టోరీ మీకోసం..
హైదరాబాద్ లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో కిషోర్ జన్మించారు. అతని తండ్రి ఓ ప్రైవేట్ సంస్థలో ఇంజనీర్. వీరి స్వస్థలం కర్ణాటక. కిషోర్ ఖరగ్ పూర్ ఐఐటీలో రసాయనశాస్త్ర విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేవారు. ఆ తరువాత మసాచుసెట్స్ యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా పొందారు. ఇదే ఇనిస్టిట్యూట్ లో పీహెచ్ డీ కంప్లీట్ చేశారు. ఆ తరువాత విదేశాలకు వెళ్లిన కిషోర్ అరిజోనాలో ఇంటెల్ కార్పొరేషన్ లో ఇంజరింగ్ గా విధుల్లోకి ఎక్కాడు.
ఆ తరువాత ఎన్నో వ్యాపారాలు ప్రారంభించాడు. వీటిలో కొన్ని సక్సెస్ కాలేదు. అలా కోటి రూపాయల వరకు నష్టం వచ్చింది. దీంతో కిషోర్ తీవ్ర నైరాశ్యంలో పడ్డాడు. చివరికి 2012లో 20 ఆవులను కొనుగోలు చేసి రంగారెడ్డి జిల్లా షాబాద్ లో డెయిరీఫాం ప్రారంభించాడు. 2013లో రెండున్నర ఎకరాల్లో ‘సిడ్స్ డెయిరీ ఫామ్’ ను ఏర్పాటు చేశారు. ఒకటిన్నర విస్తీర్ణంలో మోడల్ డెయిరీ ఫాం సిద్ధం చేశాడు. ఆ సమయంలో లీటర్ కు రూ.15కు విక్రయించారు. ఈ పాలను ఆన్ లైన్ డెలీవరీ సంస్థలు, రిటైల్ స్టోర్ల ద్వారా విక్రయించారు.
డెయిరీ ఫాంను ఏర్పాటు చేసిన కొత్తలో కిషోర్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాల ఉత్పత్తికి అయ్యే ఖర్చు, వచ్చే ఆదాయానికి చాలా తేడా ఉండడంతో ఈ వ్యాపారం కూడా ఫెయిల్ అవుతుందా? అని మదన పడ్డాడు. లీటర్ పాలను రూ.15కు విక్రయిస్తే దానికి అయ్యే ఖర్చు రూ.30. అంతేకాకుండా డెయిరీ ఫాం ను ఏర్పాటు చేయడానికి భూమి కొనుగోలు కోసం 1.3 కోట్ల లోన్ తీసుకున్నాడు. ఆ తరువాత ప్రణాళిక ప్రకారంగా అనవసర ఖర్చులు తగ్గిస్తూ వచ్చారు. మరోవైపు ఆవులు, గేదెలను వేర్వేరుగా ఉంచుతూ వేటికవే ప్రాధాన్యం సంతరించుకునేలా చేశారు.
ప్రస్తుతం సిడ్స్ డెయిరీ ఫాంలో 100కు పైగా పశువులు ఉండగా.. 120 మందికి పైగా పనిచేస్తున్నారు. 2021 లో ఈ డెయిరీ ఫాం ఆదాయం రూ.44 కోట్లు . 2022లో ఏకంగా రూ.64.5 కోట్లకు పెరిగింది. అంటే కిషోర్ ప్రతిరోజూ దాదాపు రూ.17 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. అయితే డబ్బు ముఖ్యం కాదని పనిలో నాణ్యతను వెతకడమే తన ధ్యేయమని కిషోర్ చెబుతున్నాడు. వినియోగదారులకు తక్కువ ధరలో నాణ్యమైన పాలను అందించడమే తన లక్ష్యమని కిషోర్ చెబుతున్నారు. పాలను నిత్యం పరీక్షించేందుక అత్యాధునిక లేబోరేటరీని అందుబాటులో ఉంచారు. పాలల్లో ఎలాంటి కల్తీ లేకుండా నిత్యం పరీక్షిస్తూ నాణ్యమైన పాలను తయారు చేయిస్తున్నారు. తన కుమారుడి పేరుమీద ప్రారంభించిన ఈ డెయిరీ ఫాంలో ఎలాంటి కల్తీ ఉండకూడదని అంటున్నారు.