Prostate Cancer: పురుషులకు తలెత్తే వ్యాధుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ ఒకటి. ఇది వేగంగా విస్తరిస్తోంది. క్రమంగా భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ భయపెడుతోంది. కానీ దీనికి చికిత్స తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటోంది. ప్రొస్టేట్ క్యాన్సర్ కు శక్తివంతమైన చికిత్స అవసరం అవుతుంది. అందుకే దీన్ని నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సమయాల్లో పూర్తిగా చికిత్స అవసరం లేకపోయినా మరికొన్ని సందర్భాల్లో చికిత్స అవసరం అయ్యే అవకాశాలు ఉంటాయి.

ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు పరిశీలిస్తే భిన్నంగా ఉంటాయి. మూత్ర విసర్జనలో ఇబ్బంది పడొచ్చు. మూత్రం ప్రవాహంలో వేగం తగ్గిపోవడం, మూత్రంలో రక్తం పడటం, ఎముకల్లో నొప్పి, క్రమంగా బరువు తగ్గిపోవడం, అంగస్తంభన లోపం లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సరైన విధంగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: ఎంత గొప్ప న్యూస్.. లీటర్ పెట్రోల్ పై రూ.25 తగ్గింపు.. త్వరపడండి..
ప్రొస్టేట్ క్యాన్సర్ సాధారణంగా యాభై ఏళ్ల తరువాతే సంక్రమించే అవకాశం ఉంటుంది. వంశపారంపర్యంగా సోకే వ్యాధిగా కూడా దీన్ని గుర్తించవచ్చు. తల్లిదండ్రుల్లో ఈ వ్యాధి ఉంటే మనకు సోకే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. పైగా స్థూలకాయుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుందని తెలుస్తోంది.
ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా ఉంచుకోవాలంటే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాయామం కూడా చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతి రోజు వ్యాయామం చేయడం అన్నిటికి మంచిదే. ధూమపానానికి దూరంగా ఉండాల్సిందే. ఆరోగ్య కరమైన అలవాట్లు చేసుకుంటే ఏ వ్యాధి కూడా మన దరికి చేరదని తెలుసుకోవచ్చు.
Also Read: వాటర్, ఆయిల్ ట్యాంకర్లు రౌండ్ గా ఉండటానికి కారణాలేంటి?