Nivetha Thomas – Balakrishna: నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత అద్భుతమైన విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ఈ సినిమాలోని యాయా..యాయ జై బాలయ్య అనే పాట ఎంతో ఫేమస్ అయ్యింది. ఇక పోతే ఈ పాటకు హీరోయిన్ నివేథా థామస్ బాలకృష్ణ జైసింహ సినిమాలోని ఒక పాట మూమెంట్ ను ఉపయోగిస్తూ డాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ పాటకి సంబంధించిన ఈ వీడియోను ఇంస్టాగ్రామ్ రీల్ ద్వారా షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలోని ఈ వీడియో చూసిన పలువురు బాలయ్య అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నివేథా థామస్ బాలకృష్ణ పాటకు ఈ విధంగా స్టెప్పులు వేస్తూ తనని దారుణంగా అవమానించిందని పలువురు నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరికొందరు స్పందిస్తూ సూపర్ గా డాన్స్ చేశారు అటు కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం ఆ పాటకు మీరే కొరియోగ్రఫీ చేశారు కదా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి నివేథా థామస్ చేసిన ఈ డాన్స్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
నివేద థామస్ చాలా కాలం నుంచి ఏవిధమైనటువంటి హిట్ సినిమాలు లేక ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమా ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఈమెకు పలు అవకాశాలను అందుకని కెరియర్ లో బిజీగా ఉండడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలన్నింటినీ అభిమానులతో పంచుకుంటారు.