Roja – Nani: టాలీవుడ్ ఇండస్ట్రీకి, ఏపీ ప్రభుత్వానికి మధ్య చిన్నపాటి యుద్ధం జరుగుతోంది. టికెట్ల రేట్లు తగ్గింపు విషయం పై టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలోనే నాని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఏపీలో థియేటర్ల కన్నా కిరాణా కొట్టు కలెక్షన్లు అధికంగా ఉన్నాయని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నాని ఏపీ ప్రభుత్వంపై ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో వెంటనే ఏపీ మంత్రులు ఈ విషయంపై స్పందిస్తూ తమదైన శైలిలో కౌంటర్ వేశారు.
ఈ క్రమంలోనే రోజా మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం పై నాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతో బాధాకరం అని వెల్లడించారు. ఏపీ థియేటర్ లో రాని కలెక్షన్లు కిరాణా కొట్టులో వచ్చేటప్పుడు నువ్వు సినిమాలు తీయడం వేస్టు కిరాణాకొట్టు పెట్టుకోవచ్చు కదా అంటూ తనదైన శైలిలో హీరో నాని పై సెటైర్ వేశారు. ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల ఇండస్ట్రీకి వచ్చే లాభం కన్నా నష్టమే అధికంగా ఉంటుందని, ఇలాంటి పరిస్థితులలో మంచి నిర్ణయం తీసుకుంటే అటు పెద్ద సినిమాలకు,ఇటు చిన్న సినిమాలకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఈ సందర్భంగా రోజా సినిమా టికెట్ల విషయంపై స్పందించారు.