Spirulina Cultivation: పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. నాచు జాతికి చెందిన కొన్ని మొక్కలను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందడం సాధ్యమవుతుంది. అటువంటి నాచు మొక్కలలో స్పిరులీనా ఒకటి కాగా ఈ మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉండటం గమనార్హం. సముద్రంలో ఉండే నాచును శాస్త్రీయ పద్ధతుల ద్వారా సులభంగా పండించడం సాధ్యమవుతుంది.

అయితే నాచును పండించే సమయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. చెరువులలో ఉప్పునీటిని ఏర్పాటు చేసుకుని అందులో స్పిరులినా పెరగడానికి వంట సోడా, వేప నూనె, సన్ ఫ్లవర్ ఆయిల్ ను వినియోగించాలి. నాచు మొక్కల సీడ్ ను చెరువులలో వేసిన తర్వాత 15 రోజుల పాటు కదిలించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 16వ రోజు నుంచి పంట చేతికి వస్తుంది.
అనేక రకాల ట్యాబ్లెట్స్ తయారీలో స్పిరులినాను వినియోగించడం జరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో స్పిరులినా ఎంతగానో సహాయపడుతుంది. నెల్లూరు జిల్లాకు చెందిన యువరైతు భారత్ ను సంప్రదించడం ద్వారా స్పిరులీనా పెంపకానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ పంట ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో లాభాలు సంపాదించే ఛాన్స్ ఉంటుంది.
ఎక్కువ కూలీలు అవసరం లేకుండానే ఈ పంట సాగు చేయవచ్చు. పొలంలో చెరువులను నిర్మించుకుని టర్పాలిన్ షీట్‌లను ఏర్పాటు చేసి ఎటువంటి లీకేజీలు లేకుండా జాగ్రత్త పడాలి. సెన్సార్ మోటార్లను అమర్చడం ద్వారా స్పిరులినా కల్చర్ ను డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. 100 కేజీల స్పిరులినాపై 30,000 రూపాయలు నికర లాభంగా పొందే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది.