Post Office Sceme: ఈ పథకంలో ఒక్కసారి అంత డబ్బు పెడితే.. నెలకు రూ. 20 వేలకుపైగా తీసుకోవచ్చు..

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే సీనియర్ సిటిజన్లు నెలకు రూ. 20 వేల వరకు ఆదాయం వస్తుంది. ఈ పథకం కింద వడ్డీ రేటు 8.2 శాతం. ఇది ప్రతీ త్రైమాసికానికి సవరిస్తారు.

Written By: Mahi, Updated On : October 19, 2024 2:34 pm

Post Office Sceme

Follow us on

Post Office Sceme: పేదలు, మధ్య తరగతి ప్రజల ఆర్థిక స్థితిని బట్టి ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకువచ్చాయి. అందులో కొన్ని ప్రభుత్వ పథకాలను పోస్టాఫీస్ పథకాల కింద ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీని కింద పన్ను, అధిక రాబడుల ప్రయోజనం కూడా ఉంటుంది. పోస్టాఫీస్ కింద ఉన్న ఈ చిన్న పొదుపు పథకాలు సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా ఉంటాయి. దీని కారణంగా దేశంలోని అత్యధిక జనాభా ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతారు. ఈ పథకాలు వివిధ రకాల లాభాలను అందిస్తున్నాయి. పోస్టాఫీస్ కింద ఉన్న ఈ చిన్న పొదుపు పథకాలు సురక్షితమైన పెట్టుబడికి మార్గం వేస్తాయి. ఈ కారణంగా దేశంలోని జనాభాలో ఎక్కువ మంది ఈ పథకాల వైపు ఆకర్షితులవుతారు. ఈ పథకాలు వివిధ రకాల లాభాలను అందించడంతో పాటు అవి కూడా ఎక్కువ లాభాలను ఆర్జిస్తాయి. పోస్టాఫీస్ కింద మీకు ప్రతి నెలా ఆదాయం వచ్చే ఒక పథకం గురించి ఈ రోజు తెలుసుకుందాం. మీరు ఈ పథకంలో ఒకసారి మాత్రమే డబ్బు పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత ఇక మీరు నెలవారీ ఆదాయంగా ఈ పథకం కింద పొందవచ్చు. ఆ పథకం ఏంటంటే.. ‘సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్’ (ఎస్సీఎస్ఎస్), ఇది పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా స్థిరమైన ఆదాయాన్ని అందించేందుకు ఉపయోగపడుతుంది. ఐదేళ్ల పాటు నెలకు రూ. 20,500 దీని కింద తీసుకోవచ్చు.

వడ్డీ రేటు ఎంత..?
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే సీనియర్ సిటిజన్లు నెలకు రూ. 20 వేల వరకు ఆదాయం వస్తుంది. ఈ పథకం కింద వడ్డీ రేటు 8.2 శాతం. ఇది ప్రతీ త్రైమాసికానికి సవరిస్తారు. ఈ వడ్డీ రేటును వార్షిక ప్రాతిపదికన లెక్కిస్తారు. అన్ని ప్రభుత్వ పథకాల్లో కెల్లా అత్యధికంగా వడ్డీ రేటు ఇచ్చే పథకం ఇదే. దీని మెచ్యూరిటీ పీరియడ్ ఐదేళ్లు. అదే సమయంలో ఐదేళ్ల తర్వాత పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది. ఈ పథకంలో, 60 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులు ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు.

ఎంత పెట్టుబడి పెట్టాలి..?
ఇంతకు ముందు ఈ పథకం కింద గరిష్ట పెట్టుబడి పరిమితి రూ. 15 లక్షలు, దీన్ని రూ. 30 లక్షలకు పెంచారు. ఇందులో రూ. 30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ. 2,46,000 వరకు వడ్డీ వస్తుంది. ఇలాంటప్పుడు మీకు నెలకు రూ. 20,500 ఆదాయం వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆదాయం ఇస్తుంది.

ఎవరు ఇన్వెస్ట్ చేయవచ్చు..?
మీరు ఈ పథకం కింద పెట్టుబడి పెట్టాలనుకుంటే.. మీరు సమీపంలోని పోస్టాఫీస్, బ్యాంకును సంప్రదించాలి. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఎస్సీఎస్ఎస్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయదచ్చు. అలాగే ఎవరైనా 55 నుంచి 60 ఏళ్ల వయసులో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తే అందులో ఖాతా తెరవొచ్చు.

ఈ పథకం కింద ప్రజలు ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీఎస్ఎస్ పథకం పన్ను ఆదాను కూడా అందిస్తుంది, దీని కింద మీరు మీ టాక్స్ రెస్పాన్స్ ను తగ్గించవచ్చు. ఈ పథకం కింద మరింత సమాచారం కోసం మీరు పోస్టాఫీస్ వద్దకు గానీ, లేదంటే పోస్టాఫీస్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చు. పోస్టాఫీస్ ఏజెంట్ ను కలిసినా కూడా వివరాలు తెలియజేస్తారు.