Atrocities in the old town: పాతబస్తీలో దారుణాలు.. ఓ యువతి చేసిన పని వైరల్

హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఆకతాయిలు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. పోకిరీల ఆగడాలకు అంతులేకుండాపోతోంది. దీంతో ఆ ఏరియాలో తిరగాలంటే యువతులు, మహిళలు భయపడిపోతున్నారు. వెంటబడి మరీ వేధిస్తుండడంతో వారికి సెక్యూర్ లేకుండా పోయింది

Written By: Srinivas, Updated On : October 19, 2024 2:37 pm

Stop-violence

Follow us on

Atrocities in the old town: హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఆకతాయిలు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. పోకిరీల ఆగడాలకు అంతులేకుండాపోతోంది. దీంతో ఆ ఏరియాలో తిరగాలంటే యువతులు, మహిళలు భయపడిపోతున్నారు. వెంటబడి మరీ వేధిస్తుండడంతో వారికి సెక్యూర్ లేకుండా పోయింది. మహిళలు, యువతుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుండడంతో వారు మరింత భయపడుతున్నారు. అందరూ చూస్తుండగానే అమ్మాయిలపై దాడులు కొనసాగుతున్నా ఎవరూ ఏం చేయలేని పరిస్థితి ఉంది.

అంతేగాకుండా.. బైక్ రేసింపాతబస్తీలో దారుణాలు.. ఓ యువతి చేసిన పని వైరల్

హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఆకతాయిలు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. పోకిరీల ఆగడాలకు అంతులేకుండాపోతోంది. దీంతో ఆ ఏరియాలో తిరగాలంటే యువతులు, మహిళలు భయపడిపోతున్నారు. వెంటబడి మరీ వేధిస్తుండడంతో వారికి సెక్యూర్ లేకుండా పోయింది. మహిళలు, యువతుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుండడంతో వారు మరింత భయపడుతున్నారు. అందరూ చూస్తుండగానే అమ్మాయిలపై దాడులు కొనసాగుతున్నా ఎవరూ ఏం చేయలేని పరిస్థితి ఉంది.

అంతేగాకుండా.. బైక్ రేసింగ్, ఆటో రేసింగ్‌లతో మరింత బీభత్సం సృష్టిస్తున్నారు. రోడ్డుపై వెళ్లే వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుతున్నారు. వారి సంతోషం కోసం ఎంతటి దారుణానికి అయినా దిగుతున్నారు. బైక్ స్టంట్‌లతో మరింత భయాందోళనలు సృష్టిస్తున్నారు. సింగిల్ టైర్‌పై బైకులను నడిపిస్తూ అల్లర్లు చేస్తున్నారు. పోకిరీలు పోలీసులపై రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. పోలీసులను భయబ్రాంతులకు గురిచేస్తూనే ఉన్నారు.

ఈ అల్లర్లు ఇలా ఉంటే.. కొంత మంది యువతులు వీరి దాడులను ప్రతిఘటిస్తూ వస్తున్నారు. మహిళ అంటే తక్కువ కాదని నిరూపిస్తున్నారు. అల్లర్ల తాడికిని తట్టుకుంటూ నిలుస్తున్నారు. కొందరు యువతులు వారికి చుక్కలు చూపిస్తున్నారు. అందివచ్చిన టెక్నాలజీని వాడుతున్నారు. మరికొందరైతే అల్లరి చేసిన వారిని పోలీసులకు పట్టిస్తున్నారు.

ఇటీవల వీకెండులో సరదా కోసం పాతబస్తీకి ఓ యువతి వెళ్లింది. కొందరు యువకులు ఆమె వెంట పడి వేధించారు. అంతేకాదు ఆమెపై దాడికి కూడా దిగారు. దీంతో ఆ యువతి చాలా తెలివిగా వ్యవహరించింది. ఆకతాయిల బెదిరింపులకు భయపడకుండా వారు చేస్తున్న పనులను వీడియో తీసింది. ఆ వెంటనే శాలిబండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా.. ఆ వీడియో ఫుటేజీని పోలీసులకు అందజేసింది. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆకతాయిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

మరోవైపు.. పాతబస్తీలో జరుగుతున్న అల్లర్లపై పోలీసులు కూడా స్పందించారు. పాతబస్తీలో యువకులు హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించి ప్రవర్తిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అల్లర్లు తగ్గకుంటే ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా పేర్కొన్నారు. ఇప్పటికే చాలా వరకు అక్కడ సమావేశాలు నిర్వహించి.. వారిలో చైతన్యం తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ.. కొంత మందిలో మాత్రం మార్పు రావడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మరోవైపు.. మహానగరంలో రోజురోజుకూ డ్రగ్స్, గంజాయి వాడకం పెరుగుతోంది. వీకెండ్స్ వచ్చాయంటే చాలు డ్రగ్స్ ప్లెడ్లర్స్ నగరానికి చేరుకుంటున్నారు. దాంతో ప్రభుత్వం డ్రగ్స్ వాడకాన్ని ఎంతలా కట్టడి చేయాలనుకుంటున్నప్పటికీ ఆగడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా దిగుమతి అవుతోంది. లక్షలాది రూపాయల విలువ చేసే డ్రగ్స్‌ను వినియోగిస్తున్నారు. డ్రగ్స్ మాయలో పడి ఏం చేస్తున్నారో కూడా తెలుసుకోకుండా పోతున్నారు. దాంతో అమ్మాయిలను ఏడిపిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు.. డ్రగ్స్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ యువతలో మార్పు రావడం లేదన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా పాతబస్తీలో పర్యటించాలంటే యువతులు, మహిళలు భయపడాల్సిన పరిస్థితే నెలకొందని చాలా మంది చెబుతుండడం ఆందోళన కలిగించే అంశం.గ్, ఆటో రేసింగ్‌లతో మరింత బీభత్సం సృష్టిస్తున్నారు. రోడ్డుపై వెళ్లే వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుతున్నారు. వారి సంతోషం కోసం ఎంతటి దారుణానికి అయినా దిగుతున్నారు. బైక్ స్టంట్‌లతో మరింత భయాందోళనలు సృష్టిస్తున్నారు. సింగిల్ టైర్‌పై బైకులను నడిపిస్తూ అల్లర్లు చేస్తున్నారు. పోకిరీలు పోలీసులపై రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. పోలీసులను భయబ్రాంతులకు గురిచేస్తూనే ఉన్నారు.

ఈ అల్లర్లు ఇలా ఉంటే.. కొంత మంది యువతులు వీరి దాడులను ప్రతిఘటిస్తూ వస్తున్నారు. మహిళ అంటే తక్కువ కాదని నిరూపిస్తున్నారు. అల్లర్ల తాడికిని తట్టుకుంటూ నిలుస్తున్నారు. కొందరు యువతులు వారికి చుక్కలు చూపిస్తున్నారు. అందివచ్చిన టెక్నాలజీని వాడుతున్నారు. మరికొందరైతే అల్లరి చేసిన వారిని పోలీసులకు పట్టిస్తున్నారు.

ఇటీవల వీకెండులో సరదా కోసం పాతబస్తీకి ఓ యువతి వెళ్లింది. కొందరు యువకులు ఆమె వెంట పడి వేధించారు. అంతేకాదు ఆమెపై దాడికి కూడా దిగారు. దీంతో ఆ యువతి చాలా తెలివిగా వ్యవహరించింది. ఆకతాయిల బెదిరింపులకు భయపడకుండా వారు చేస్తున్న పనులను వీడియో తీసింది. ఆ వెంటనే శాలిబండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా.. ఆ వీడియో ఫుటేజీని పోలీసులకు అందజేసింది. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆకతాయిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

మరోవైపు.. పాతబస్తీలో జరుగుతున్న అల్లర్లపై పోలీసులు కూడా స్పందించారు. పాతబస్తీలో యువకులు హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించి ప్రవర్తిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అల్లర్లు తగ్గకుంటే ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా పేర్కొన్నారు. ఇప్పటికే చాలా వరకు అక్కడ సమావేశాలు నిర్వహించి.. వారిలో చైతన్యం తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ.. కొంత మందిలో మాత్రం మార్పు రావడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మరోవైపు.. మహానగరంలో రోజురోజుకూ డ్రగ్స్, గంజాయి వాడకం పెరుగుతోంది. వీకెండ్స్ వచ్చాయంటే చాలు డ్రగ్స్ ప్లెడ్లర్స్ నగరానికి చేరుకుంటున్నారు. దాంతో ప్రభుత్వం డ్రగ్స్ వాడకాన్ని ఎంతలా కట్టడి చేయాలనుకుంటున్నప్పటికీ ఆగడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా దిగుమతి అవుతోంది. లక్షలాది రూపాయల విలువ చేసే డ్రగ్స్‌ను వినియోగిస్తున్నారు. డ్రగ్స్ మాయలో పడి ఏం చేస్తున్నారో కూడా తెలుసుకోకుండా పోతున్నారు. దాంతో అమ్మాయిలను ఏడిపిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు.. డ్రగ్స్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ యువతలో మార్పు రావడం లేదన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా పాతబస్తీలో పర్యటించాలంటే యువతులు, మహిళలు భయపడాల్సిన పరిస్థితే నెలకొందని చాలా మంది చెబుతుండడం ఆందోళన కలిగించే అంశం.