Post Office Schemes: మంచి జాబ్, అందమైన ఫ్యామిలీ.. మనవరకు బాగానే ఉంటాం. కానీ మనల్ని పెంచి పోషించే తల్లిదండ్రులు కూడా బాగుండాలి. అప్పుడే అసలైన జీవితం అని అంటారు. జీవితాంతం మనల్ని చదివించి, ఓ దారిలో పెట్టాక వారు అలసిపోతారు. దీంతో వారు పనిచేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతోవారి ఆదాయం తగ్గి ఖర్చులకు సరిపడా డబ్బు ఉండదు. అప్పుడు వారి కుమారులే వారిని పోషించాలి.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఆదాయం తక్కువగా వస్తుంది. ఈ క్రమంలో బ్యాంకులో మూలన ఫిక్సడ్ డిపాజిట్లలో ఉన్న డబ్బుతో భవిష్యత్ లో వడ్డీ రావొచ్చు. కానీ ఇప్పటి అవసరాలు మాత్రం తీరవు. ఒకవేళ నెలనెలా తల్లిదండ్రులకు డబ్బులు పంపించాలన్నా ఒక నెల ఇబ్బంది ఏర్పడితే వారు అవస్థలకు గురవుతారు. ఇలాంటి పరిస్థితిని అర్థం చేసుకున్న పోస్టాఫీసు వాళ్లు ఓ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అదే మంథ్లీ ఇంట్రెస్ట్ పేయింగ్ స్కీం.
ఈరోజుల్లో డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలున్నాయి. కానీ వచ్చిన ఆదాయాన్ని సేఫ్ గా ఉంచుకోవడం గగనంగా మారింది. ఇంట్లో డబ్బును దాచుకోవడం వల్ల దొంగల భయం ఎక్కువగా ఉంది. దీంతో చాలా మంది బ్యాంకుల్లో ఇన్వెస్ట్ మెంట్ చేస్తున్నారు. కొందరు ఫిక్స్ డ్ డిపాజిట్లు చేయగా.. మరికొందరు సాధారణ సేవింగ్స్ చేస్తున్నారు.
బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేయడం ద్వారా మధ్యలో అవసరానికి ఉపయోగపడదు. ఈ సమయంలో నెలనెలా ఖర్చులకు ఇబ్బందిగా మారుతుంది. అయితే మన డబ్బు బ్యాంకులో సేఫ్ గా ఉండి నెలనెలా ఇంట్రెస్ట్ ఇచ్చే స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. పోస్టాపీసులో డబ్బులు ఫిక్స్ డ్ చేయడం ద్వారా ఒకేసారి వడ్డీ కాకుండా నెలనెలా చెల్లించే స్కీము కూడా ఉంది. ఇలా చేయడం వల్ల మీ డబ్బులు సేఫ్ గా ఉండడంతో పాటు నెలనెలా ఖర్చులకు ఆదాయం వస్తుంది.
పోస్టాఫీసుల్లో మీరు ఫిక్స్ డ్ చేసిన డబ్బుకు నెలనెలా వడ్డీని వారు చెల్లిస్తారు. ఇవి మీకు అవసరాలు తీరడంతో పాటు మీ డబ్బు సేఫ్ గా ఉంటుంది. ఉదాహరణకు రూ.9 లక్షల డిపాజిట్ చేస్తే 7.4 శాతం వడ్డీని నెలనెలా మీ అకౌంట్లలో వేస్తుంది. అంటే రూ.5,500 ప్రతినెలా సరైన సమయానికి జమ అవుతుంది. ఈ వడ్డీని మీ తల్లిదండ్రుల అకౌంట్లలో సరైన సమయానికి వారికి చేరేలా చూడంది. దీంతో మీకు వచ్చే ఆదాయంలో వారికి ఇవ్వలేనప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఉద్యోగులు రిటైర్డ్ అయిన తరువాత పింఛన్ వస్తుంటుంది. కానీ ఇది రాని వారికి ఇలాంటి ఆదాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా సీనియర్ సిటీజన్స్ కు ప్రత్యేక మైన స్కీమ్స్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకొని తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందిలేకుండా ఆదాయం వచ్చేలా ప్లాన్ చేసుకోండి.