Bigg Boss 7 Telugu: బుల్లితెర సూపర్ హిట్ రియాలిటీ షో బిగ్ బాస్ మరికొద్ది రోజుల్లో టెలికాస్ట్ కాబోతుంది. దానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ కి ముందు హోస్ట్ నాగార్జున విషయంలో కొన్ని కామెంట్స్ వినిపించాయి. గత సీజన్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు, అందుకే ఈసారి హోస్ట్ ను చేంజ్ చేస్తున్నారని, అలాగే బిగ్ బాస్ సెట్ ను అన్నపూర్ణ స్టూడియో లో కాకుండా పూణే కి మార్చారని వార్తలు వచ్చాయి, కానీ ఒకే ఒక్క టీజర్ తో వాటికి పుల్ స్టాప్ పెట్టింది బిగ్ బాస్ టీం.
ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్ విషయంలో రోజుకో న్యూస్ వినిపిస్తూ ఉంది. నిజానికి బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళటానికి టాప్ సెలబ్రిటీస్ అంత ఉత్సాహం చూపించడం లేదని చెప్పాలి. అక్కడికి వెళ్లిన తర్వాత ఉన్న విలువ పోవడం తప్ప ఇంకేమి లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో సెలెబ్రిటీస్ ను పట్టుకోవడం బిగ్ బాస్ టీం కు తలకు మించిన భారం అవుతుంది. నిజం చెప్పాలంటే గత సీజన్ ఫెయిల్ కావడానికి ప్రధాన కారణం సరైన సెలెబ్రిటీస్ లేకపోవడం పైగా క్రియేటివ్ టీం సరైన టాస్క్ లు ప్లాన్ చేయకపోవటమే అని చెప్పాలి.
దీంతో ఈ సీజన్ లో అలాంటి పొరపాట్లు జరగకుండా చూడటం కోసం బిగ్ బాస్ టీం గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికైతే కొందరి పేర్లు వినిపిస్తున్న కానీ అందులో నలుగురైదుగురు మించి ఫైనల్ కాలేదని తెలుస్తుంది. టీవీ నటుడు ప్రభాకర్, మై విలేజ్ షో అనిల్, డాన్స్ మాస్టర్ ఆట సందీప్ అతని వైఫ్ మాత్రమే ఇప్పటిదాకా అగ్రిమెంట్ ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే స్వాతినాయుడు కూడా దాదాపుగా కంఫర్మ్ అయినట్లే, విష్ణుప్రియ, వర్ష, సురేఖావాణి, మోహన్ భోగరాజు లాంటి వాళ్ళతో చర్చలు నడుస్తున్నాయి కానీ, ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తుంది.
నిజానికి బిగ్ బాస్ లో అంత ముందుగానే ప్లాన్ జరుగుతుందని, ఎవరు ఎన్ని వీక్స్ ఉండాలి, ఒక్కో వీక్ కి వారికి ఇవ్వాల్సిన పేమెంట్ ఎంత అనే దానిని బట్టి కంటెస్టెంట్ లను తీసుకుంటారు అనే మాటలు వినిపిస్తున్నాయి. కాకపోతే ప్రేక్షకులను ఇన్వాల్ చేయడానికి అన్నట్లు మాత్రమే ఓటింగ్ అంటూ పోల్ అంటూ బిగ్ బాస్ టీం హడావిడి చేస్తుంది తప్ప, ఆడియన్స్ అభిప్రాయాలను పెద్దగా పట్టించుకోదు అనే మాటలు వినిపిస్తున్నాయి.
ఈ సీజన్ లో మంచి కంటెస్టెంట్స్ ను ఇన్వాల్ చేస్తే తప్ప బిగ్ బాస్ సక్సెస్ కాదు. గతంలో మాదిరి తాడూ బొంగరం లేకుండా వ్యవహరిస్తే మరోసారి ఘోరమైన ఎదురుదెబ్బ తినడం ఖాయం. అయితే బిగ్ బాస్ టీం ప్రయత్నాలు చూస్తుంటే గట్టి సెలెబ్రెటీస్ ను పట్టుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సెలెబ్రిటీస్ కంఫర్మ్ చేస్తే ఆ తర్వాత టెలికాస్ట్ తేదీని బిగ్ బాస్ టీం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.. అప్పటిదాకా వెయిట్ అండ్ సీ