PM Kisan: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పీఎం కిసాన్ సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటి. కేంద్రం ఈ స్కీమ్ ద్వారా రైతులకు 6,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తోంది. కేంద్రం మూడు విడతల్లో ఈ సాయాన్ని అందిస్తుండటం గమనార్హం. 2,000 రూపాయల చొప్పున కేంద్రం పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాలలో జమ చేయనుందని సమాచారం అందుతోంది. ఇప్పటివరకు పీఎం కిసాన్ పది విడతల నగదు ఖాతాలో జమైంది.
రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించాలనే ఆలోచనతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. https://pmkisan.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చనే సంగతి తెలిసిందే. అయితే ఈ స్కీమ్ 11వ విడత డబ్బులను పొందాలనుకునే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీని పూర్తి చేయాలి. ఈకేవైసీ అప్ డేట్ చేసుకోవడం ద్వారా పీఎం కిసాన్ స్కీమ్ కు అర్హత పొందవచ్చు.
Also Read: మేడారానికి కేసీఆర్.. అమ్మవార్ల కోసం నిర్ణయం
పీఎం కిసాన్ వెబ్ సైట్ లో ఈ కేవైసీ ఆప్షన్ ను ఎంచుకుని ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ ను సంప్రదించి పీఎం కిసాన్ వెబ్ సైట్ లో ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా ఈ స్కీమ్ కోసం అర్హతను పొందే అవకాశం ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ లోకి లాగిన్ కావడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా ఇచ్చే మొత్తాన్ని మరింత పెంచితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కేంద్రం 2024 ఎన్నికల సమయానికి ఈ మొత్తం పెంచే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం అందుతుంది.
Also Read: మూడో కూటమిలో జగన్ చేరతారా? కేసీఆర్ తో కలుస్తారా?