AP-Telangana: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విబజన తరువాత రెండు రాష్ట్రాల్లో నిదుల విషయంలో లొల్లి మొదలైంది. మాకు నిధులు రావాలంటే మాకే రావాలని అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ గొడవలు పడుతున్నాయి. కానీ కేంద్రం విభజన విషయంలో ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో ఇన్నాళ్లు రెండు రాష్ట్రాలు తమ పంతం నెగ్గించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతోనే రెండు రాష్ట్రాలు ఆశాభావంతో ఉన్నాయి. కానీ రెండుప్రాంతాల మధ్య నిధుల గొడవ రాజుకోవడంతో కేంద్రం ఏ మేరకు చల్లారుస్తుందో తెలియడం లేదు.
తెలంగాణ డిస్కంల నుంచి రూ. 3445 కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నాయని ఏపీ చెబుతోంది. కానీ తెలంగాణ మాత్రం మాకే రావాలని అడుగుతోంది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య నిధుల లొల్లి చల్లారడం లేదు. విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ఇన్నాళ్లు వేచి చూసిన కేంద్రం వాటిని తీర్చాలని భావిస్తోంది. దీని కోసమే త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ మేరకు కమిటీ రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదుర్చడానికి ఏ చర్యలు తీసుకుంటుందో తెలియడం లేదు.
ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజిస్తే భారీగా నిధులు వచ్చే అవకాశముంది. దీంతో తెలంగాణ ఏపీకి నిధులు ఇచ్చేందుకు వెనకాడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఏ మేరకు రెండు రాష్ట్రాల మధ్య నిధులు పంచాయితీ తీరుస్తుందో తెలియడం లేదు. దక్షిణాదిలో పట్టు కోసం పరితపిస్తున్న బీజేపీ తెలంగాణ, ఆంధ్రలో పాగా వేయాలని చూస్తోంది. ఇందు కోసమే విభజన హామీల అమలుకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.
Also Read: ఆంధ్రలో థియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీ.. టికెట్ల పెంపు కూడా !
దీంతో రెండు రాష్ట్రాల్లో తమ పలుకుబడి పెంచుకోవాలని చూస్తోంది. దీనికి సంబంధించిన కార్యక్రమాలు అమలు చేసేందుకు సంకల్పించింది. రెండు రాష్ట్రాల్లో ఓటు బ్యాంకు నిలబెట్టుకోవాలని రంగం సిద్ధం చేసుకుంటోంది. నిధుల లొల్లి తీర్చి రెండు ప్రాంతాల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని నిర్ణయించుకుంది. ఈక్రమంలో బీజేపీ యుక్తులు ఎంత మేరకు పని చేస్తాయో తెలియడం లేదు. కానీ తెలంగాణలో మాత్రం బీజేపీకి మంచి ఫాలోయింగ్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ, ఏపీల్లో ప్రభావం చూపాలని ప్రణాళికలు రచిస్తోంది. దీనికి గాను అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ లాంటి చోట్ల అధికార పార్టీకి చుక్కలు చూపించిన సందర్భంలో టీఆర్ఎస్ కూడా బీజేపీనే టార్గెట్ చేస్తోంది. కానీ రెండు రాష్ట్రాల్లో నిధుల లొల్లిని తీర్చితే బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.