Aadhar Card Phone Number Update: మనలో ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమైన కార్డులలో ఆధార్ కార్డ్ ఒకటనే సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో ఏ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందాలన్నా ఆధార్ కార్డును తప్పనిసరిగా కలిగి ఉండాల్సిందేనని చెప్పవచ్చు. అయితే ఆధార్ కార్డుకు తప్పనిసరిగా ఫోన్ నంబర్ ను లింక్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కు ఫోన్ నంబర్ ను లింక్ చేయకపోతే ఇబ్బందులు పడక తప్పదని గుర్తుంచుకోవాలి.
ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవాలన్నా ఆధార్ కార్డ్ సహాయంతో ఇతర కార్యకలాపాలు చేయాలన్నా ఫోన్ నంబర్ కు వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ ఎంతో ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఆధార్ కార్డ్ లో ఇచ్చిన ఫోన్ నంబర్ ను మార్చాలనుకుంటే ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి మార్చాలని భావిస్తున్న ఫోన్ నంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ను కూడా ఎంటర్ చేయాలి.
Also Read: ప్చ్.. సినిమా టికెట్ల కోసం గొంతు కోయడం ఏమిటయ్యా ?
ఆ తర్వాత సెండ్ ఓటీపీ బటన్ ను ప్రెస్ చేసి ఫోన్ నంబర్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి ప్రొసీడ్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ ఆధార్ సర్వీసెస్ ఆప్షన్ ను ఎంచుకుని అప్ డేటింగ్ ది మొబైల్ నెంబర్ ఆప్షన్ ను ఎంచుకుని అవసరమైన వివరాలను అందజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సమీపంలోని ఆధార్ సెంటర్ కు వెళ్లి అక్కడ అవసరమైన డాక్యుమెంట్లను అందజేయాల్సి ఉంటుంది.
సమీపంలోని ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ కు వెళ్లడం ద్వారా కూడా సులభంగా ఫోన్ నంబర్ ను మార్చుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆధార్ కార్డును కలిగి ఉన్నవాళ్లకు ఈ ఆప్షన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
Also Read: ఎన్టీఆర్ ను వాడుకొని చంద్రబాబు-లోకేష్ పై వైసీపీ దాడి?
Recommended Video: