Bheemla Nayak Collections: ‘భీమ్లా నాయక్’ ఏపీ & తెలంగాణ సెకండ్ డే కలెక్షన్స్

Bheemla Nayak Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా రిలీజ్ అయిన సెకండ్ డే కలెక్షన్స్ విషయంలో కూడా కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. పవన్ రాజకీయాల్లోకి వెళ్లినా.. పవర్ ఏ మాత్రం తగ్గలేదు అని ఈ సినిమా నిరూపించింది. నిజానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి ఫస్ట్ వీక్ పడుతుంది అనుకున్నారు. కానీ, ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే.. ఈ […]

Written By: Shiva, Updated On : February 26, 2022 10:15 am
Follow us on

Bheemla Nayak Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా రిలీజ్ అయిన సెకండ్ డే కలెక్షన్స్ విషయంలో కూడా కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. పవన్ రాజకీయాల్లోకి వెళ్లినా.. పవర్ ఏ మాత్రం తగ్గలేదు అని ఈ సినిమా నిరూపించింది. నిజానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి ఫస్ట్ వీక్ పడుతుంది అనుకున్నారు.

Pawan Kalyan and Rana Daggubati in Bheemla Nayak

కానీ, ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే.. ఈ సినిమా రెండు రోజుల్లోనే లాభాల్లోకి వెళ్లిపోయేలా ఉంది. ‘భీమ్లా నాయక్’ కోసం మూడేళ్లుగా పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ‘భీమ్లా నాయక్’ రిలీజ్ కాగానే థియేటర్ల వద్ద భారీ హంగామా నెలకొంది.

Also Read:  భీమ్లానాయక్ దెబ్బకు ఏకంగా సెలవు ప్రకటించిన ఆ దిగ్గజ కంపెనీ

ఏది అయితే ఏం.. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బోణీ పడింది. బుకింగ్స్ ను బట్టి అంచనా వేస్తే.. ఈ చిత్రం సెకండ్ డే కలెక్షన్స్ ను ఏరియాల వారీగా చూస్తే ఇలా ఉండే అవకాశం ఉంది.

Bheemla Nayak Collections

నైజాం 8.70 కోట్లు

సీడెడ్ 3.30 కోట్లు

ఉత్తరాంధ్ర 1.02 కోట్లు

ఈస్ట్ 1.06 కోట్లు

వెస్ట్ 1.10 కోట్లు

గుంటూరు 1.40 కోట్లు

కృష్ణా 1.21 కోట్లు

నెల్లూరు 1.38 కోట్లు

ఏపీ & తెలంగాణలో ‘భీమ్లా నాయక్’ టోటల్ సెకండ్ డే కలెక్షన్స్ – 19 కోట్ల 17 లక్షలు.

ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ – 32 కోట్ల 56 లక్షలు వచ్చాయి. మొదటి రెండు రోజుల ఏపీ & తెలంగాణ కలెక్షన్స్ మొత్తం కలుపుకుని చూస్తే : 51 కోట్లు 73 లక్షలు వచ్చే అవకాశం ఉందని బుకింగ్స్ చెబుతున్నాయి.

Also Read: భీమ్లానాయక్ ప్రభావం గట్టిగానే కనిపించింది ! 

Tags