Health Tips: వీరు కాఫీకి దూరంగా ఉండాలి.. తాగారో ఇక అంతే!

అనారోగ్య సమస్య ఉన్నవారు తాగితే మరంత డేంజర్‌ అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు కాఫీకి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

Written By: Neelambaram, Updated On : March 26, 2024 3:57 pm

People Who Should Never Drink Coffee

Follow us on

Health Tips: కాఫీ అంటే చాలా మంది ఇష్టపడతారు. కొందరు అయితే పదే పదే కాఫీ తాగుతారు. అయితే కాఫీలో కెఫిన్‌ అనే పదార్థం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం తెలిసి కూడా కాఫీ ప్రియులు దానిని దూరం పెట్టరు. అయితే కాఫీ ఎక్కువగా తాగితే మన ఆరోగ్యం కూడా డేంజర్‌లో పడుతుంది. ఇక అనారోగ్య సమస్య ఉన్నవారు తాగితే మరంత డేంజర్‌ అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు కాఫీకి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

వీరు కాఫీకి దూరంగా ఉండాలి..
– అధిక రక్తపోటు ఉన్నవారు కాఫీకి దూరంగా ఉండాలి. వీరు కాఫీ తాగితే హైబీపీని మరింత పంచుతుంది.

– డయాబెటిస్‌ ఉన్నవారు కూడా కాఫీ తాగడం మంచిది కాదు. తరచూ కాఫీ తాగడం వల్ల డయాబెటిస్ బాధితుల్లో షుగర్ లెవెల్స్ మరింత పెరుగుతాయి.

– గర్భిణులు కూడా కాఫీ తాగడం మంచిది కాదు. అలవాటు ఉన్నవారు మానేయడం మంచిది. గర్భంతో ఉన్నప్పుడు ఎక్కుగా కాఫీ తాగితే రిస్‌‍్క ఎదుర్కొంటారు. మానలేనివారు పరిమితంగా తాగాలి.

– ఒత్తిడిలో ఉన్నవారు ఎక్కువగా కీఫీలు తాగుతారు. ఒత్తిడి నుంచి రికాల్స్‌ పొందినట్లు ఫీల్‌ అవుతారు. కానీ ఒత్తిడిలో ఉన్నప్పుడు కాఫీ తాగితే కార్టిసాల్ హార్మోన్ నియంత్రణలో ఉండదని వైద్యులు పేర్కొటున్నారు. ఇది మరింత ఒత్తడిని పెంచుతుందంటున్నారు.

– తరచూ మూత్ర విసర్జన చేసే వారు కూడా కాఫీకి దూరంగా ఉండాలి. అతిగా మూత్ర విసర్జన చేయడం అనారోగ్య లక్షణం. అందుకే అనారోగ్యంతో బాధపడేవారు కాఫీని తాగకుండా ఉంటే మంచిది.

– గుండె జబ్బులతో బాధపడేవారు కూడా కాఫీ తాగడం మంచిది కాదు. కాఫీ రక్తపోటును పెంచుతుంది. గుండె సమస్యలను మరింత పెంచుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కాఫీకి దూరంగా ఉండడం మంచిది.