AP BJP: బిజెపికి నమ్ముకున్న వారికి టిక్కెట్లు

అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి పురందేశ్వరి, నరసరావుపేట నుంచి భూపతి శ్రీనివాస్ వర్మ, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి నుంచి వరప్రసాద్ ల పేర్లను బిజెపి హై కమాండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Written By: Dharma, Updated On : March 26, 2024 4:04 pm

AP BJP

Follow us on

AP BJP: ఏపీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను బిజెపి ప్రకటించింది. పొత్తులో భాగంగా ఆరు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ప్రకటన చేయడానికి కసరత్తు చేస్తోంది. అయితేపార్లమెంటు అభ్యర్థుల ఎంపిక విషయంలో సీనియర్లకు న్యాయం జరగలేదని ఆరోపణలు వచ్చాయి. పార్టీ అనుబంధ విభాగాల నుంచి వచ్చిన వారి పేర్లను పరిగణలోకి తీసుకోలేదని హై కమాండ్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే బిజెపికి లోక్సభ స్థానాలు కీలకము కాబట్టి..గెలుపు గుర్రాలను బరిలో దించినట్లు హై కమాండ్ స్పష్టం చేసింది.అసెంబ్లీ స్థానాల విషయంలో మాత్రం సీనియర్లకు పరిగణలో తీసుకుంటామని చెప్పుకొచ్చింది.

అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి పురందేశ్వరి, నరసరావుపేట నుంచి భూపతి శ్రీనివాస్ వర్మ, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి నుంచి వరప్రసాద్ ల పేర్లను బిజెపి హై కమాండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో శ్రీనివాస వర్మ ఆర్ఎస్ఎస్ విభాగం నుంచి వచ్చిన నేత. మిగతా ఐదుగురు మాత్రం బలమైన అభ్యర్థులుగా భావించి బిజెపి టిక్కెట్లు ఖరారు చేసింది. అయితే రాష్ట్ర బిజెపి సీనియర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అసెంబ్లీ టికెట్లను మాత్రం వారికి ఎక్కువ శాతం కేటాయించినట్లు తెలుస్తోంది.

విశాఖ ఉత్తరం నుంచి విష్ణుకుమార్ రాజుకు టికెట్ ఖరారు అయ్యే అవకాశం ఉంది. బిజెపిలో ఆయన సీనియర్ నాయకుడు. పార్టీ అనుబంధ విభాగాల నుంచి వచ్చారు. మరోవైపు గోదావరి జిల్లాలో సోము వీర్రాజు పేరును కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. ఆయన సైతం చాలా ఏళ్లుగా బిజెపిలో కొనసాగుతూ వచ్చారు. పార్టీ అనుబంధ విభాగాల్లో పని చేశారు. కడప జిల్లా నుంచి సత్య కుమార్ ను ఖరారు చేయనున్నారు. ఆయన సైతం దశాబ్దాలుగా బిజెపిలో కొనసాగుతూ వచ్చారు. అయితే సీనియర్లలో కొందరు టిడిపి, మరికొందరు బ్రో వైసిపి నేతలుగా ముద్రపడ్డారు. అందుకే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో హై కమాండ్ అలర్ట్ అయ్యింది. గెలుపు గుర్రాలను బరిలో దించుతునే.. పార్టీని నమ్ముకున్న వారికి సైతం న్యాయం చేస్తోంది.