Parenting: బెస్ట్ పేరేంట్స్ కావాలంటే.. తప్పకుండా చేయాల్సిన పనులివే!

బెస్ట్ పేరెంట్స్‌గా మారాలంటే పిల్లల విషయంలో తల్లిదండ్రులు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. మరి అవేంటో తెలియాలంటే ఆలస్యం చేయకుండా స్టోరీ మొత్తం చదివేయండి.

Written By: Kusuma Aggunna, Updated On : October 31, 2024 9:52 pm

Parenting Tips

Follow us on

Parenting: ప్రతీ తల్లిదండ్రులు వారి పిల్లలను చిన్నప్పటి నుంచే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. పిల్లలను పెంచడం అసలు చిన్న విషయం కాదు. ఎందుకంటే చిన్నతనంలో పిల్లలు చాలా అల్లరి చేస్తారు. దీంతో కొందరు తల్లిదండ్రులు తట్టుకోలేక పిల్లలను కొట్టడం, తిట్టడం వంటివి చేస్తారు. దీంతో పిల్లలు బాగా మొండిగా తయారవుతారు. దీనివల్ల పిల్లలు క్రమశిక్షణతో ఉండరు. తల్లిదండ్రులు పిల్లలతో మంచిగా ఉండాలి. వీళ్లే మాకు బెస్ట్ పేరెంట్స్ అని పిల్లలు అనేంత విధంగా తల్లిదండ్రులు వారిని పెంచాలి. అయితే ఈ రోజుల్లో తల్లిదండ్రులు సొంత పనుల్లో బిజీ అయిపోయి.. అసలు పిల్లలను పట్టించుకోవట్లేదు. ఆఫీస్ వర్క్, ఇంటి పనుల్లో బిజీ అయిపోయి వారిని చూసుకోవడానికి ఆయాలను పెడుతున్నారు. వారు ఎంత బాగా చూసుకున్న కూడా తల్లిదండ్రులు చూపించే ప్రేమ వేరే కదా. అయితే బెస్ట్ పేరెంట్స్‌గా మారాలంటే పిల్లల విషయంలో తల్లిదండ్రులు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. మరి అవేంటో తెలియాలంటే ఆలస్యం చేయకుండా స్టోరీ మొత్తం చదివేయండి.

పిల్లలతో సమయం గడపండి
రోజులో ఎంత బిజీగా ఉన్నా కూడా పిల్లలతో కాస్త సమయం గడపండి. వారికి స్కూల్ వర్క్‌లు చేయించడం, తినిపించడం వంటి పనులు చేయాలి. దీనివల్ల వారికి తల్లిదండ్రుల ప్రేమ దొరుకుతుంది. కొందరు వారి పనుల్లో బిజీగా ఉండి పిల్లలను అసలు పట్టించుకోరు. దీనివల్ల పిల్లలకి తల్లిదండ్రులతో బంధం స్ట్రాంగ్‌గా ఉండదు.

మీరే అన్ని విషయాలు నేర్పించండి
తల్లిదండ్రులే పిల్లలకు రోల్‌ మోడల్‌గా ఉండాలి. వారికి చిన్నప్పటి నుంచే అన్ని విషయాలను నేర్పించాలి. మంచి లేదా చెడు పిల్లలు తల్లిదండ్రులనే చూసి నేర్చుకుంటారు. కాబట్టి వారు మంచి మార్గంలో వెళ్లేటట్లు నైతిక విలువలు నేర్పించాలి. మీ పనుల్లో బిజీ అయిపోయి పిల్లలను పక్కన పెట్టవద్దు. వర్క్ కంటే పిల్లలు ముఖ్యమని భావించండి. అప్పుడు మీకు తెలియకుండానే మీరు పిల్లలకు సమయం ఇస్తారు.

వాళ్లను పొగడండి
పిల్లలు తప్పు చేస్తే కొందరు తల్లిదండ్రులు తిడుతుంటారు. కానీ వారు ఏదైనా మంచి పనిచేస్తే ప్రశంసించరు. వాళ్లు చేసే చిన్న పనులను ప్రశంసించడం అలవాటు చేసుకోండి. దీనివల్ల పిల్లలు సంతోషంగా ఉంటారు. ఈసారి నుంచి ఇక మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఇతరులపై కోపం, ఈర్ష్యతో ఉండకుండా తల్లిదండ్రులు చెప్పాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వారికి ఏం తెలియదు. తల్లిదండ్రులే ప్రతీ విషయాన్ని క్లియర్‌గా చెప్పాలి.

సాయం చేయడం నేర్పించండి
ఏవరైనా కష్టాల్లో ఉన్నా సాయం చేయాలని పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించండి. అలాగే వారికి ఏవరైనా సాయం చేస్తే కృతజ్ఞతలు చెప్పాలని కూడా తెలపండి. దీనివల్ల వారికి అన్ని విషయాలు గురించి కూడా తెలుస్తుంది. బెస్ట్ పేరెంట్స్‌గా ఉండాలంటే ప్రతీ తల్లిదండ్రులు తప్పకుండా పిల్లలకు ఈ విషయాలు అన్ని నేర్పించాలి. లేకపోతే వారు మంచి దారిలో కాకుండా చెడు దారిలో వెళ్లే ప్రమాదం ఉంటుంది.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు.