Rajinikanth-Allu Arjun : అల్లు అర్జున్ కారణంగా ఆగిపోనున్న రజినీకాంత్ మూవీ షూటింగ్..సమయం చూసి భలే దెబ్బ కొట్టాడుగా!

అల్లు అర్జున్, నెల్సన్ కాంబినేషన్ లో సినిమా ఖరారై చాలా కాలం అయ్యింది. పుష్ప 2 చిత్రం పూర్తి అవ్వగానే ఈ సినిమా ప్రారంభించాలి. మరోపక్క రజినీకాంత్ లోకేష్ కనకరాజ్ తో చేస్తున్న 'కూలీ' చిత్రం శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటుంది. డిసెంబర్ నెలలో టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Written By: Vicky, Updated On : October 31, 2024 9:39 pm

Rajinikanth-Allu Arjun

Follow us on

Rajinikanth-Allu Arjun : కోలీవుడ్ వర్గాల్లో ఇప్పుడొక హాట్ టాపిక్ తెగ వైరల్ గా మారింది. అదేమిటంటే అల్లు అర్జున్ కారణంగా త్వరలో ప్రారంభం అవ్వబోయే సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాకి అల్లు అర్జున్ సినిమా పెద్ద సమస్య గా మారిందట. అసలు విషయంలోకి వెళ్తే గత ఏడాది రజినీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘జైలర్’ చిత్రం గత ఏడాది విడుదలై భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. వరుస ఫ్లాప్స్ లో ఉన్న రజినీకాంత్ ని సక్సెస్ ట్రాక్ లో తీసుకొని వచ్చిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద 650 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని అప్పట్లో డైరెక్టర్ చెప్పలేదు. సినిమాలో కూడా పార్ట్ 2 కి లీడ్ వచ్చేలా ఎలాంటి సన్నివేశం కూడా పెట్టలేదు. కానీ ప్రస్తుతం పాన్ ఇండియా లో సీక్వెల్స్ హవా ఎలా కొనసాగుతుందో ప్రత్యేకిచ్చి చెప్పనవసరం లేదు.

పెద్ద సినిమాల నుండి, చిన్న సినిమాల వరకు ప్రతీ ఒక్కరు తమ సినిమాలకు సీక్వెల్ ఉందంటూ ఎండ్ టైటిల్స్ పడే ముందు చూపిస్తున్నారు మేకర్స్. ఈ డిమాండ్ ని గమనించే నెల్సన్ రజినీకాంత్ తో ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్ ప్రకటించాడు. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. వివరాల్లోకి వెళ్తే అల్లు అర్జున్, నెల్సన్ కాంబినేషన్ లో సినిమా ఖరారై చాలా కాలం అయ్యింది. పుష్ప 2 చిత్రం పూర్తి అవ్వగానే ఈ సినిమా ప్రారంభించాలి. మరోపక్క రజినీకాంత్ లోకేష్ కనకరాజ్ తో చేస్తున్న ‘కూలీ’ చిత్రం శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటుంది. డిసెంబర్ నెలలో టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. జనవరి నెల నుండి ఆయన కూడా ‘జైలర్ 2’ చిత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. డేట్స్ కూడా కేటాయించేసాడు. అయితే ఇటు పక్క అల్లు అర్జున్ కూడా నెల్సన్ కి జనవరి లేదా, ఫిబ్రవరి నెల నుండి డేట్స్ కేటాయించడాన్ని టాక్ వినిపిస్తుంది.

ఈ రెండు సినిమాలలో ఎదో ఒకటి ఆయన మొదట ప్రారంభించాల్సిందే. అందుకని నెల్సన్ దిలీప్ కుమార్ ముందుగా అల్లు అర్జున్ సినిమానే చేస్తాడని, ‘జైలర్ 2 ‘ చిత్రం షూటింగ్ కి గ్యాప్ ఇస్తాడని కోలీవుడ్ లో ఒక వార్త చక్కర్లు కొట్టింది. దీనిపై రజినీకాంత్ అభిమానులు సోషల్ మీడియా లో అల్లు అర్జున్ పై ఫైర్ అయ్యారు. మరోపక్క అల్లు అర్జున్ ‘పుష్ప 2’ విడుదల అవ్వగానే త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడనే రూమర్ కూడా ప్రచారం లో ఉంది. ఈ చిత్రానికి 500 కోట్ల రూపాయిల బడ్జెట్ అవుతుందట. మరి ఈ రెండు సినిమాలలో ఆయన ఏది ముందు చేయబోతున్నాడు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ నెల్సన్ సినిమానే ఆయన ముందు ఎంచుకుంటే ‘జైలర్ 2’ షూటింగ్ ని కొంతకాలం వాయిదా వేయక తప్పదు.