https://oktelugu.com/

Pushpa 2 : పుష్ప 2 ‘ క్లైమాక్స్ లో కనిపించబోతున్న స్టార్ హీరో అతనే..సుకుమార్ సినిమాటిక్ యూనివర్స్ షురూ!

గతి తెలిసిందే. ఇది కార్యరూపం దాల్చి మన ముందుకు వస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేము కానీ, ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో లీకై తెగ వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా క్లైమాక్స్ లో ఒక ప్రముఖ స్టార్ హీరో ముఖ్య అతిథిగా కనిపించబోతున్నాడట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. 'పుష్ప 2' తర్వాత సుకుమార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : October 31, 2024 / 09:55 PM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2 :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’ గురించి సోషల్ మీడియా లో రోజుకో అప్డేట్ లీక్ అవుతూ అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఆసక్తి ఒక రేంజ్ లో పెంచేస్తుంది. ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్ లో నిర్మాతలు ‘పుష్ప 3’ కూడా ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది కార్యరూపం దాల్చి మన ముందుకు వస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేము కానీ, ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో లీకై తెగ వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా క్లైమాక్స్ లో ఒక ప్రముఖ స్టార్ హీరో ముఖ్య అతిథిగా కనిపించబోతున్నాడట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే.

    ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే ఈ సినిమాకి సంబంధించి రామ్ చరణ్ పరిచయ సన్నివేశం, పుష్ప 2 క్లైమాక్స్ లో ఉంటుందని అంటున్నారు. అంటే ‘పుష్ప 2’ కి , రామ్ చరణ్ తో తీయబోయే సినిమాకి లింక్ ఉంటుందన్నమాట. సౌత్ ఇండియా లో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటే యూత్ ఆడియన్స్ వేరెక్కి పోతారు. ఖైదీ తో మొదలైన ఈ సినిమాటిక్ యూనివర్స్ ‘విక్రమ్’, ‘లియో’, ‘ఖైదీ 2’, ‘రోలెక్స్’ , ‘విక్రమ్ 2’ ఇలా పెద్ద లిస్తే ఈ యూనివర్స్ లో ఉంది. ఇలా సుకుమార్ సినిమాటిక్ యూనివర్స్ కి ‘పుష్ప’ చిత్రం ఆద్యం అని, ఆ యూనివర్స్ లోనే రామ్ చరణ్ సినిమా కూడా ఉంటుందని, అది ‘పుష్ప 2’ క్లైమాక్స్ లో తెలుస్తుందని అంటున్నారు. ఇదే నిజమైతే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ వేట ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటుంది. రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్లిద్దరు ఇప్పుడు టాలీవుడ్ హీరోలు కాదు, పాన్ వరల్డ్ హీరోలు. వీళ్ళ సినిమాల కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది.

    అలాంటిది వీళ్లిద్దరు కలిసి ఒకే సినిమాలో ఉంటే ఇక ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవడానికి కూడా కష్టమే. గతంలో రామ్ చరణ్ హీరో గా నటించిన ‘ఎవడు’ చిత్రంలో అల్లు అర్జున్ 10 నిమిషాల ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడు. కానీ వీళ్లిద్దరు కలిసి ఒక్క సన్నివేశం లో కూడా కనిపించలేదు. కానీ ‘పుష్ప 2’ క్లైమాక్స్ లో వీళ్లిద్దరు ఒకే సన్నివేశంలో కనిపిస్తారట. ఈ ఇరువురి హీరోల అభిమానులు సోషల్ మీడియా లో నిత్యం ఫ్యాన్ వార్స్ చేసుకుంటూ ఉంటారు. ఇలా వీళ్లిద్దరు కలిసి ఒకే సినిమాలో కనిపించిన తర్వాత అయినా వీళ్లిద్దరి మధ్య ఫ్యాన్ వార్స్ ఆగుతాయో లేదో చూడాలి. మరి ‘పుష్ప 2’ లో రామ్ చరణ్ కామియో ఉందా లేదా అనేది తెలియాలంటే డిసెంబర్ 5 వరకు ఆగాల్సిందే.