Palak Paneer Recipe: శీతాకాలం వచ్చేసింది.. ఈ కాలంలో వేడివేడిగా మిరపకాయల బజ్జీలు తినాలని అందరికీ అనిపిస్తుంటుంది. ఈ టైం ఎంతో విలువైనది. కొన్ని కరకరలాడే తాజా శీతాకాలపు ఆకుకూరలను ఆస్వాదించడానికి ఇది మంచి సమయం అని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అందరూ ఇష్టపడి తినే పాలక్ పన్నీర్ కాంబినేషన్ గురించి తాజాగా ఒక సంచలన విషయాన్ని చెప్పారు నిపుణులు. పాలక్ (పాలకూర) అందరికీ ముఖ్యమైన ఎంపిక. సులభంగా లభ్యమయ్యే.. అందుబాటులో ఉండే పాలకూర పోషకాలతో నిండి ఉంటుందని చెప్పొచ్చు. శరీర వృద్ధికి ద్రోహదపడే ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు.. మరిన్నింటితో నిండి ఉంటుంది. అంతేకాకుండా ఇది చాలా బహుముఖమైనది. స్మూతీ నుండి సబ్జీ.. మరిన్నింటి వరకు మీరు కేవలం పాలకూరతో అనేక రకాల వంటకాలను తయారు చేయవచ్చు.

చాలామంది రోటీలోకి మా ఫేవరెట్ పాలక్ పన్నీర్ అని చెబుతారు. ఇప్పటికీ ప్రతీవేడుకల్లో వంటకాల్లో ఒకటి పాలక్ పనీర్ గా ఉంటుంది. రోటీ, పరాటాతో జత చేస్తే శీతాకాలపు పాలక్ పనీర్ ఆరోగ్యకరమైన భోజనంగా నిలుస్తుంది. కానీ మీకు తెలుసా.. పాలక్ మరియు పనీర్ కలిపి తినడం డేంజర్ అని న్యూట్రీషియన్లు చెబుతున్నారు. ప్రముఖ న్యూట్రీషనిస్ట్ పాలక్ మరియు పనీర్ కలిసి తినకూడదని పంచుకున్నారు. ఫోటో షేరింగ్ యాప్‌లో అప్‌లోడ్ చేసిన ఒక వీడియోలో, “కొన్ని కాంబినేషన్‌లు బాగా కలిసి ఉండవు” అని పేర్కొంది.
* పాలక్ మరియు పనీర్ ఎందుకు కలిసి తినకూడదు: “ఆరోగ్యకరమైన ఆహారం అంటే సరైన సమయంలో సరైన ఆహారాన్ని తినడం కాదు. అది సరైన కలయికలో ఉండటం కూడా” అని నిపుణులు సూచిస్తున్నారు. కలిసి తిన్నప్పుడు ఒకదానికొకటి పోషకాల శోషణను నిరోధించే కొన్ని ఆహార కలయికలు ఉన్నాయి. అటువంటి కలయిక కాల్షియం , ఇనుము. ఈ రెండూ విరుద్ధ స్వభావం గల మూలకాలు. పనీర్ లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పాలక్ (పాలకూర) ఇనుముతో నిండి ఉంటుంది. ఈ రెండింటిని కలిసి తిన్నప్పుడు, పనీర్‌లోని కాల్షియం పాలక్ యొక్క ఇనుము శోషణను నిరోధిస్తుంది” అని న్యూట్రీషనిస్టులు చెబుతున్నారు.

మీరు పాలక్‌ను ఎక్కువగా ఉపయోగించాలనుకుంటే, పాలక్ ఆలూ లేదా పాలక్ మొక్కజొన్న కలిపి తినండి అని నిపుణులు సూచిస్తున్నారు. రుచికరమైన పాలక్ ఆలూ రెసిపీని దానికి ప్రత్యామ్మాయంగా తినొచ్చని చెబుతున్నారు. ఈ చలికాలంలో మీరు ప్రయత్నించేందుకు మరో ఆరోగ్యకరమైన ఆహారంగా ‘పాలక్ కబాబ్’ రిసిపిని ఎంచుకోవచ్చు. ఇలా ‘పాలక్ పన్నీర్’కు ప్రత్యామ్మాయంగా ఈ వంటకాలను చేసుకొని తినండి.. మీ ఒంటికి పోషకాలు సంపూర్ణంగా అందేలా చూసుకోండి..