Bigg Boss Telugu 6 Episode 94: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు ఫైనల్ కి ఒక్క అడుగు దూరం లో ఉంది..కెప్టెన్సీ టాస్కులన్నీ గత వారం తోనే ముగిసిపోవడం తో ఈ వారం మొత్తం టైటిల్ విన్నర్ క్యాష్ ప్రైజ్ ని పెంచే టాస్కులనే నిర్వహిస్తున్నాడు బిగ్ బాస్..గడిచిన ఈ మూడు రోజుల్లో 38 లక్షలకు పడిపోయిన క్యాష్ ప్రైజ్ ని, కంటెస్టెంట్స్ టాస్కులు గెలిచి 43 లక్షల రూపాయలకు పెంచేలా చేసారు.

ఇన్ని వారాలు చాలా హీట్ వాతావరణం లో జరిగిన బిగ్ బాస్ హౌస్, ఇప్పుడు చాలా కూల్ గా ఫన్ తో గడిచిపోతుంది..నిన్న బిగ్ బాస్ క్యాష్ ప్రైజ్ ని పెంచే దిశగా కంటెస్టెంట్స్ కి ఒక ఫన్నీ టాస్కు ని నిర్వహించాడు..కన్ఫెషన్ రూమ్ మొత్తాన్ని దెయ్యాల కొంప గా మార్చి..అందులో ఒక క్యాండిల్ మరియు గన్ ని పడేసి..ఆ భయానక వాతావరణం లో చీకట్లోనే క్యాండిల్ మరియు గన్ ని వెతకమని చెప్తాడు బిగ్ బాస్.
ఈ టాస్కు మొత్తం చూసే ప్రేక్షకులకు పొట్ట చెక్కలు అయ్యేలా చేసింది..ముందుగా ఆదిరెడ్డి రూమ్ లోకి అడుగుపెడతాడు..లోపలకు వచ్చిన ఆది రెడ్డి ని ఆడేసుకుంటాడు బిగ్ బాస్..ఆది రెడ్డి భయపడే విధానం చూసి నవ్వు ఆపుకోలేము..భయంకరమైన సౌండ్స్ తో కళ్ళు చెదిరే ఎఫెక్ట్స్ తో రామ్ గోపాల్ వర్మ దెయ్యం సినిమాలను తలపించే విధమైన వాతావరణం ని ఏర్పాటు చేసాడు బిగ్ బాస్..’లోపాలకి మనిషిని ఎవరిని సడన్ గా నా మీదకి వదలకండి..నా గుండె ఆగిపోతాది’ అని బిగ్ బాస్ ని అంటాడు.

ఇక ఆ తర్వాత శ్రీహాన్ కూడా ఆ రూమ్ లోకి అడుగుపెడతాడు..ఇతను ఆది రెడ్డి కంటే ఎక్కువ భయపడుతాడు..ఇతను అరిచే అరుపులు చూసి ఆది రెడ్డి మరింత భయపడుతాడు..అలా భయం తో వణికిపోతున్న ఈ ఇద్దరినీ బిగ్ బాస్ కావాల్సినంతసేపు ఇష్టం వచ్చినట్టు ఆడేసుకుంటాడు..చివరికి వీళ్లిద్దరు క్యాండిల్ మరియు గన్ ని వెతికి పట్టుకొని బయటపడతారు..ఈ ఎపిసోడ్ మొత్తం చాలా ఫన్ తో నడిచిపోయింది.