Devotional Tips: సాధారణంగా ప్రతి ఒక్కరూ జీవితంలో మంచిగా ఉండాలని చాలా కష్టపడుతూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఇలా ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి నప్పటికి మన చేతిలో ఆ డబ్బు నిలవదు. ఇలా డబ్బులు ఇవ్వక పోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మనలో ఈ మూడు దరిద్రపు అలవాట్లు కనుక ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో డబ్బు నిలవదని పండితులు చెబుతున్నారు. మరి ఆ అలవాటు ఏమిటి అనే విషయానికి వస్తే..
* చాలామంది ఏదైనా కుర్చీలో కూర్చున్నప్పుడు వాళ్లు కాళ్ళను తిన్నగా ఉండనివ్వరు. కాళ్లను ఊపుతూ కూర్చోవడం లేదా కాలిపై కాలు వేసుకొని కూర్చోవడం చేస్తూ ఉంటారు. ఇలా కాళ్లు ఊపుతూ కూర్చోవడం వల్ల అసలు దరిద్రం చుట్టుకుంటుంది. ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే ఈ అలవాటును మానుకోవడం ఎంతో మంచిదని మనం కుర్చీలో కూర్చున్నప్పుడు మన కాళ్ళు రెండు భూమిని తాకాలని అప్పుడే మంచి జరుగుతుందని తెలియజేస్తున్నారు.
*ఇక మరొక అలవాటు విషయానికి వస్తే చాలామంది ఆలయానికి వెళ్ళినప్పుడు లేదా ఇంటిలో పూజ చేసిన అనంతరం దేవుడికి కొబ్బరికాయ కొడతారు.అలా కొబ్బరికాయ కొట్టే ముందు కొబ్బరికాయ పైన కుంకుమ బొట్లు పెడతారు.అలా పెట్టమని ఏ పండితుడైనా చెప్పారో లేకపోతే ఇది వారి సొంత నిర్ణయమో తెలియదు కానీ ఈ విధంగా కొబ్బరికాయకు కుంకుమ బొట్లు పెట్టడం వల్ల మనం ఏ దరిద్రం అయితే తొలగిపోవాలని కొబ్బరికాయ కొడతామో అంతకు పదింతలు దరిద్రం మనకు చుట్టుకుంటుందని పండితులు చెబుతున్నారు.
*ఇక చాలామంది మన పెద్దవారు ఆచరించిన ఆచారవ్యవహారాలను తప్పు పడుతూ ఉంటారు.సాధారణంగా మన ఇంట్లో ఒక ఫోటో ఏదైనా ఉంది అనుకుంటే అది మన తాతల తండ్రుల కాలం నుంచి మన ఇంట్లోనే ఉంటుంది.వారి విషయాల్లో అన్ని మంచి జరిగి మన విషయంలో ఏదైనా చెడు జరిగితే ఈ ఫోటో కారణంగా మనకి చెడు జరిగింది, ఈ వస్తువు కారణంగా మనకు చెడు జరిగిందని ఆలోచిస్తూ ఉంటారు. ఈ అలవాటు కూడా దరిద్రానికి సంకేతమని పండితులు చెబుతున్నారు.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: No matter how hard you try you will not get the result these 3 habits are the reason
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com