Shani Effect: కుంభ రాశి వారికి అధిపతి శని గ్రహం. వచ్చే ఏడాది ప్రారంభంలో శని కుంభరాశిలోకి ప్రవేశించడంతో వారికి మంచి ఫలితాలు కలగనున్నాయి. దీంతో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ప్రతి రెండున్నరేళ్లకు ఒకసారి రాశిని మార్చే శని 2023లో కుంభరాశిలోకి రావడంతో వారికి అనేక శుభాలు కలగడం సహజమే. శని సంచారంతో కుంభరాశి వారికి అనుకూలమైన ఫలితాలు ప్రయోజనం కలిగించనున్నాయి. నవగ్రహాల్లో శనిగ్రహానికి ప్రాధాన్యం ఉంటుంది. అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహంగా శనికి పేరుంది.

ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించేందుకు రెండున్నరేళ్లు పడుతుంది. దీంతో ఒక రాశి చక్రం పూర్తి కావాలంటే ముప్పై ఏళ్లు పడుతుంది. ప్రస్తుతం మకర రాశిలో ఉన్న శని వచ్చే సంవత్సరంలో కుంభరాశిలోకి వస్తాడు. శనిని న్యాయానికి మారుపేరుగా చెబుతారు. ప్రజలు చేసే పనులకు వారికి చెడు, మంచి ఫలితాలు పంచడంలో సమభావం పాటించడంతోనే శనిని న్యాయనిర్ణేతగా పిలవడం సహజమే. మన జాతకంలో శని ప్రభావం మంచిగా ఉన్నప్పుడు మనకు అన్ని శుభాలే కలుగుతాయి. శని వక్రదృష్టితో చూస్తే చెడు ఫలితాలు వస్తాయి.
జనవరి 17న శని రాశి మారుతాడు. సొంత రాశి కుంభంలోకి ప్రవేశిస్తాడు. దీంతో కుంభరాశి వారికి మంచి ఫలితాలు వస్తాయనడంలో సందేహం లేదు. ఈ రాశి వారిపై అనుగ్రహం కలిగిస్తాడు. వారి జీవితాల్లో వెలుగులు నింపనున్నాడు. ఇంకా వృషభ రాశి వారికి కూడా మంచి ఫలితాలు ఇవ్వనున్నాడు. జాతక చక్రంలో పదో ఇంట్లో శని సంచారం వల్ల జీవితంలో ఎంతో ఉన్నత ఫలితాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు సంతృప్తి కలిగిస్తాయి. మిథున రాశి వారికి కూడా అనుకూలమైన సమయమే. శని అనుగ్రహంతో వీరి అదృష్టం మరింత ఇనుమడిస్తుంది. పెండింగులో ఉన్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయ మార్గాలు అనుకూలిస్తాయి.

మకర రాశి వారికి కూడా మంచి కాలమే. శుభఫలితాలే పలకరిస్తాయి. వీరి జాతక చక్రంలో రెండో గృహంలో శనిదేవుడు సంచరించడంతో ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. శ్రమకు తగిన ఫలితం వస్తుంది. శనిగ్రహం అనుకూలంగా ఉండటంతో ఈ రాశుల వారికి ఉత్తమ ఫలితాలు కలగనున్నాయి. వారి జాతకం కొత్త మలుపులు తిరగనుంది. కొత్త సంవత్సరంలో వారికి మంచి ఫలితాలు వారిలో ఆనందాలు పంచనున్నాయి. శని అనుగ్రహం వల్ల ఈ రాశుల వారి బతుకు తీరు మారనుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.