Bigg Boss 6 Telugu- Inaya Sultana: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్లిన తర్వాత కంటెస్టెంట్స్ కెరీర్లు మరో లెవెల్ కి వెళ్తాయో లేదో చెప్పలేము కానీ,వాళ్ళ వ్యక్తిగత జీవితాలపై మాత్రం గట్టి ప్రభావమే చూపిస్తుంది అని చెప్పొచ్చు..ఉదాహరణకి బిగ్ బాస్ సీజన్ 5 రన్నర్ షణ్ముఖ్ జస్వంత్ ని తీసుకుందాం..ఇతనికి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టకముందే నిజజీవితంలో దీప్తి సునైనా అనే అమ్మాయి లవర్ గా ఉంది..వీళ్లిద్దరి పెళ్ళికి ఇంట్లో కూడా ఒప్పుకున్నారు.

కానీ బిగ్ బాస్ హౌస్ లో మనోడు సిరి తో బాగా క్లోజ్ అవ్వడం,ఆమెతో మితిమీరిన రొమాన్స్ చెయ్యడం తో షణ్ముఖ్ తో బ్రేకప్ చేసేసుకుంది..అలా షణ్ముఖ్ మరియు దీప్తి సునైనా నిజ జీవితాలపై బిగ్ బాస్ ఎఫెక్ట్ ఆ విధంగా పడింది..ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న ఇనాయ సుల్తానా నిజజీవితం పై కూడా బిగ్ బాస్ ప్రభావం బలంగా పడింది..కానీ అది ఆమెకి పాజిటివ్ గానే జరిగింది.
బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఇనాయ తన వ్యక్తిగత విషయాలను హౌస్ మేట్స్ కి చెప్తూ ‘నేను సినిమా రంగం లోకి రావడం మా కుటుంబం లో ఎవరికీ ఇష్టం లేదు..మా అమ్మ నాతో మాట్లాడడం మానేసింది..ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాను..ఇది నా జీవితం లో దొరికిన అతిపెద్ద అవకాశం..ఇది చూసి అయినా మా అమ్మ నన్ను క్షమించి ఫ్యామిలీ వీక్ అప్పుడు బిగ్ బాస్ లోకి అడుగుపెడితే చూడాలనిఉంది’ అంటూ చాలా ఎమోషనల్ గా చెప్తుంది.

ఆమె ఆశించినట్టుగానే నిన్న బిగ్ బాస్ హౌస్ లోకి ఇనాయ అమ్మ అడుగుపెట్టింది..మనస్ఫూర్తిగా ఆమెని ఆశీర్వదించింది..ఆడపులి అంటూ పొగిడింది..కప్ కొట్టే ఇంటికి తిరిగిరావాలంటూ ప్రోత్సహించింది..అలా బిగ్ బాస్ షో ద్వారా తల్లి కూతుర్లు ఇద్దరు కలిసిపోవడం హౌస్ మేట్స్ తో పాటుగా చూసే ప్రేక్షకులకు కూడా బాగా అనిపించింది..నిన్న ఎపిసోడ్ కి ఈ బ్లాక్ కూడా ప్రధాన హైలైట్స్ లో ఒకటిగా నిలిచింది.