SS Thaman: సౌత్ ఇండియా లో ఒక రేంజ్ డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరు థమన్..ప్రతి హీరోకి ఇప్పుడు థమన్ కావాలి..ప్రస్తుతం ఆయన చేతిలో దాదాపుగా 12 సినిమాలు ఉన్నాయి..గత ఏడాది అఖండ సినిమా తో..ఈ ఏడాది భీమ్లా నాయక్ సినిమా తో థమన్ తన అద్భుతమైన మ్యూజిక్ తో ప్రేక్షకులను మాయ చేసేసాడు..భీమ్లా నాయక్ లో అయితే చాలా సన్నివేశాలు థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్ల వేరే లెవెల్ కి వెళ్లాయి..ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోతుంది భీమ్లా నాయక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.

ఇప్పుడు అందరి చూపు థమన్ సంగీతం అందిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ చిత్రం పైనే ఉంది..ఎందుకంటే అఖండ వంటి సెన్సషనల్ హిట్ తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో వెంటనే వస్తున్న సినిమా ఇది..ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన మొదటి లిరికల్ వీడియో విడుదల అవ్వబోతుంది..’జై బాలయ్య’ అంటూ సాగే ఈ పాట ఫాన్స్ కి కిక్ ని ఇవ్వబోతుంది.
ఇదంతా పక్కన పెడితే ఈరోజు ఉదయం థమన్ వేసిన ఒక ట్వీట్ పెద్ద ట్రోల్ మెటీరియల్ అయ్యింది..ఆయన మాట్లాడుతూ ‘ఇప్పుడే నేను ఫైనల్ లిరికల్ వీడియో ని చూసాను..జై బాలయ్య మాస్ పాటకి సౌండ్ మిక్సింగ్ వేరే లెవెల్ లో వచ్చింది..ఆ సౌండ్ దెబ్బకి నా సబ్ ఊఫర్లు పగిలిపోయాయి’ అంటూ పగిలిపోయిన సబ్ ఓఫర్లను ఫోటో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు..వెంటనే ఒక నెటిజెన్ ఫ్లిప్ కార్ట్ లో ఒక కస్టమర్ పెట్టిన డ్యామేజ్డ్ సబ్ ఊఫర్ ఫోటో పెట్టి ‘మాస్ అన్నా’ అంటాడు.

కట్ చేస్తే థమన్ పెట్టిన ఫోటో, ఆ నెటిజెన్ పెట్టిన ఫ్లిప్ కార్ట్ కస్టమర్ ఫోటో రెండు ఒకేలాగా ఉన్నాయి..అంటే థమన్ ఆ ఫోటోని దొంగలించి ఇక్కడ పెట్టాడు అన్నమాట..ఇది తెలుసుకున్న నెటిజెన్స్ థమన్ పై ‘ట్యూన్స్ ని మాత్రమే దొంగిలిస్తావు అనుకున్నాము..ఇలా ఫోటోలను కూడా దొంగిలించడం ప్రారంబించావా’ అంటూ సెటైర్లు వేస్తున్నారు..అయితే థమన్ ఫ్యాన్స్ దీనికి సమాధానం చెప్తూ ‘పాట విడుదలైన తర్వాత మీ ఊఫర్లు అలా మిగిలిపోతాయని సింబాలిక్ గా థమన్ అలా అన్నాడని’ చెప్పుకొస్తున్నారు.