Neeraj Chopra: ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, ఇండియా జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ లో చాంపియన్ గా నిలిచిన తొలి భారత క్రీడాకారుడిగా చరిత్ర తిరగరాశాడు. స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో గురువారం రాత్రి జరిగిన ఫైనల్లో చోప్రా స్వర్ణం చేజిక్కించుకుని అందరిని ఆశ్చర్యపరచాు. జావెలిన్ త్రో లో పోటీపడిన నీరవ్ 88.44 మీటర్లు విసిరి ముందంజలో నిలవడం గమనార్హం. రెండో ప్రయత్నంలో అందరికంటే ఎక్కువ దూరం విసిరి పతకం సాధించడం జరిగింది.

నీరజ్ చోప్రా మొదటి ప్రయత్నంలో నో త్రో గా ప్రకటించినందున ఫలితం దక్కలేదు. రెండో ప్రయత్నంలో 88.44 మీటర్లు విసిరి అందరికంటే ముందు నిలిచాడు. జాకుబ్ వడ్లెజ్ 86.94 మీటర్లు విసిరాడు. నీరజ్ చోప్రా తనదైన శైలిలో అత్యంత దూరం విసిరి చరిత్ర లిఖించాడు. ఇంతవరకు స్విట్జర్లాండ్ లో మనకు పతకం దక్కకపోవడంతో ఇప్పుడు నీరజ్ తో ఆ కల నెరవేరింది. దీంతో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు నీరవ్. గాయం కారణంగా ఒలింపిక్స్ వెళ్లలేకపోయినా ఇక్కడ స్వర్ణం సాధించడం విశేషం.
Also Read: India vs Pakistan Asia Cup Match Effect: పాకిస్తాన్ తో ఓటమి ఎంత పని చేసింది
డైమండ్ లీగ్ మీటింగ్ టైటిల్ ను గెలుచుకున్న మొదటి భారతీయుడిగా నీరజ్ నిలవడం గర్వకారణం. డైమండ్ లీగ్ పోటీల్లో అతడు పోటీ పడటం ఇది మూడో సారి. 2017, 2018 ఎడిషన్స్ లో ఆడినా ఏడు, నాలుగో స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ సారి కసితో ఆడి తన పట్టు నిలుపుకున్నాడు. స్వర్ణం సాధించి తన వాంఛ నెరవేర్చుకున్నాడు. ఒలింపిక్స్ తరువాత డైమండ్ లీగ్ ను ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అందుకే ఇందులో ఎలాగైనా విజయం సాధించాలని నీరజ్ చోప్రా ఇన్నాళ్లు ప్రయత్నించి ఈ సారి మాత్రం విజయం సాధించాడు.

2023 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 13 సిరీస్ ల్లో ప్రదర్శన ద్వారా అథ్లెట్లు ఫైనల్ ఈవెంట్ కు అర్హత సాధిస్తారు. ప్రతి కేటగిరీలో ఫైనల్లో నెగ్గిన విజేతలను డైమండ్ లీగ్ చాంపియన్ గా గుర్తిస్తారు. ప్రతి కేటగిరీలో విజేతకు రూ. 24 లక్షల ప్రైజ్ మనీ అందిస్తారు. మొత్తానికి నీరజ్ చోప్రా స్విట్జర్లాండ్ లో నమోదు చేసిన విజయంతో భారత దేశం గర్విస్తోంది. అత్యంత ప్రజాదరణ పొందిన డైమండ్ లీగ్ లో ప్రతిభ చాటి స్వర్ణ పతకం గెలుచుకోవడంతో అందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:NBK 107 Pre Release Business: టైటిల్ కూడా ఖారారు కాకముందే 80 కోట్లు కొల్లగొట్టిన బాలయ్య బాబు
[…] Also Read: Neeraj Chopra: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా […]