Samantha Father Joseph: జీవితంలో పెళ్లి ఒకేసారి జరగాలని అందరూ కోరుకుంటారు. దాన్ని నూరేళ్ళ బంధంగా పెద్దలు వర్ణిస్తారు. భారతీయ సమాజంలో పెళ్లి పవిత్ర కార్యం. ఆడా మగా మధ్య పెద్దల సమక్షంలో ఏర్పరుచుకునే లాంగ్ రిలేషన్. తల్లిదండ్రులు కూడా ఎమోషనల్ గా ఈ బంధానికి కనెక్ట్ అవుతారు. కూతురో లేక కొడుకో వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడితే పేరెంట్స్ మానసిక వేదన అనుభవిస్తారు. సమంత తండ్రి జోసెఫ్ ఇదే ఆవేదనను అనుభవించినట్లు అర్థం అవుతుంది. సమంత-నాగ చైతన్య విడాకుల ప్రకటన చేసి దాదాపు ఏడాది కావస్తుండగా తాజాగా ఆయన స్పందించారు. ఒక విధంగా చెప్పాలంటే జోసెఫ్ చాలా ఎమోషనల్ అయ్యారు.

సమంత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన జోసెఫ్… ”చాలా కాలం క్రితం ఓ అందమైన కథ ఉండేది… ఇప్పుడు అది లేదు” అని కామెంట్ పెట్టాడు. ఆయన పోస్ట్ కి అనేక మంది రెస్పాండ్ అయ్యారు. కామెంట్స్ రూపంలో తమ స్పందన తెలియజేసే ప్రయత్నం చేశారు. జోసెఫ్ కామెంట్ సెక్షన్ లో మరో కామెంట్ పోస్ట్ చేశారు ”మీ ఫీలింగ్స్ కి ధన్యవాదాలు. అవును నేను ఈ ఎమోషన్స్ ని అధిగమించడానికి చాలా కాలం ఇబ్బందిపడ్డాను. అయితే జీవితం అనేది చాలా చిన్నది. ఎమోషన్స్ కారణంగా ఎప్పుడూ కృంగిపోతూ ఉండలేం…” అని ఆయన పోస్ట్ చేశారు.
Also Read: Neeraj Chopra: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా
సమంత విడాకుల మేటర్ ఆయన్ని ఎంతటి ఆవేదనకు గురిచేసిందో చెప్పడానికి ఈ సోషల్ మీడియా పోస్ట్ నిదర్శనం. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన సమంత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నాగ చైతన్యను పెళ్ళాడి గొప్పింటికి కోడలిగా వెళ్ళింది. తల్లిదండ్రులు సంతోషించడానికి ఇంత కన్నా కావాల్సింది ఏమి ఉంటుంది. అయితే ఆ సంతోషం విడాకుల ప్రకటనతో ఆవిరైపోయింది. సమంత-నాగ చైతన్య 2021 అక్టోబర్ లో విడాకుల ప్రకటన చేశారు.

అంతకు ముందే వాళ్ళు విడిపోయి వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పించి, నచ్చజెప్పి ఒకటి చేసే ప్రయత్నం చేశారు. చైతన్య సంగేతేమో కానీ సమంత మొండిది. అనుకుంటే జరిగిపోవాల్సిందే. ఎందరు చెప్పినా ఆమె కన్విన్స్ కాలేదు. చివరకు అధికారికంగా విడిపోయారు. తల్లిదండ్రులను మానసిక వేదనకు గురిచేశారు. కాగా వీరిద్దరి ప్రస్తుత వయసు 35 ఏళ్ళు, ఈ క్రమంలో ఇద్దరిపై కుటుంబ సభ్యులు రెండో పెళ్లి ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. సమంత ఏమో కానీ నాగ చైతన్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అంటున్నారు.
[…] Also Read: Samantha Father Joseph: సమంత తండ్రి గుండె పగిలిన వేళ… […]
[…] Also Read: Samantha Father Joseph: సమంత తండ్రి గుండె పగిలిన వేళ… […]