spot_img
Homeలైఫ్ స్టైల్Health Tips: ఆరోగ్యం కోసం అల‌వాట్లు మార్చుకోవాల్సిందేనా?

Health Tips: ఆరోగ్యం కోసం అల‌వాట్లు మార్చుకోవాల్సిందేనా?

Health Tips: ఆధునిక కాలంలో మ‌నిషి ప‌లు ర‌కాల వ్యాధుల బారిన ప‌డుతున్నాడు. వింతైన అల‌వాట్ల‌తో త‌న ముప్పును తానే కొనితెచ్చుకున్నాడు. త్వ‌ర‌గా ముస‌లి త‌నం కూడా వ‌స్తోంది. పూర్వ కాలంలో మ‌నిషి అల‌వాట్లు ఆహారం భిన్నంగా ఉండేవి. స‌హ‌జ‌మైన ఆహారం, నిరంత‌ర శ్ర‌మ‌తో నూరేళ్లు హాయిగా జీవించేవారు. కానీ కాల‌క్ర‌మంలో మ‌నిషి ఆయువు త‌గ్గిపోతోంది. తాజా లెక్క‌ల ప్ర‌కారం మ‌నిషి స‌గ‌టు జీవిత‌కాలం 60 సంవ‌త్స‌రాల‌కు త‌గ్గిపోవ‌డం తెలిసిందే.

గ‌త ప‌రిస్థితుల‌కు నేటికి చాలా మార్పులు వ‌చ్చాయి. పంటలు పండించే క్ర‌మంలో ర‌సాయనిక ఎరువుల ప్ర‌భావంతో ఒళ్లు గుళ్ల‌బారిపోతోంది. ఎముక‌లు చచ్చుబ‌డిపోత‌న్నాయి. న‌ల‌భై దాటిందంటే ర‌క్త‌పోటు, మ‌ధుమేహం లాంటి రోగాలు ద‌రి చేరి మ‌నిషిని ఎక్కువ కాలం బ‌త‌క‌కుండా చేస్తున్నాయి. దీంతో స‌గ‌టు జీవిత‌కాలంలో అనేక ఆటుపోట్ల‌కు గుర‌వుతున్నాడు.

Health Tips
Health Tips

అయినా త‌న అల‌వాట్ల‌ను మాత్రం మార్చుకోలేక‌పోతున్నాడు. మ‌ద్య‌పానం, ధూమ‌పానం, మాంసాహారం లాంటి వాటిని వ‌దులుకోలేక‌పోతున్నాడు. వీటి స‌హ‌జీవ‌నంతో మ‌నిషి చాలా ఇబ్బందులు ప‌డుతున్నాడు. అయినా త‌న బ‌ల‌హీన‌త‌ల‌ను మార్చుకోవ‌డం లేదు. రోజురోజుకు శ‌రీరాన్ని రోగాల‌కు ద‌గ్గ‌ర‌గా తీసుకొస్తున్నాడు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదు. ఫ‌లితంగా మంచి మార్గంలో ప‌య‌నించ‌డం లేదు.

ఇంట్లోనే కంప్యూట‌ర్ ముందు కూర్చుని ప‌ని చేయ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్, బీపీ లాంటి వ్యాధులు వ‌స్తాయ‌ని తెలిసినా త‌ప్ప‌డం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి ఉద్యోగాలే అంద‌రికి వ‌స్తున్నాయి. దీంతో ఏం చేయ‌లేని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో టీవీ చూస్తూ తింటే కూడా రోగాల బారిన ప‌డే అవ‌కాశ‌మున్నా మాన‌డం లేదు. త‌ద్వారా మ‌నిషి త‌న శ‌రీరాన్ని కాపాడుకోవ‌డం లేదు. రోగాల నుంచి దూరం కావ‌డానికి కొన్ని ప‌ద్ధ‌తులు పాటించాల్సిందే.

ఆధునిక కాలంలో మ‌నిషి నిద్ర‌కు కూడా క్ర‌మంగా దూర‌మ‌వుతున్నాడు. నేటి కాలంలో రాత్రి పూట చేసే ఉద్యోగాలే ఎక్కువ‌గా ఉండ‌టంతో నిద్ర లేమి వెంటాడుతోంది. త‌గినంత నిద్ర లేక‌పోతే ఆరోగ్యం కూడా దెబ్బ‌తింటుంద‌ని తెలిసినా తప్ప‌డం లేదు.

జిహ్వ చాప‌ల్యం కోస‌మే అర్రులు చాస్తున్నాడు. కానీ దాంతో వ‌చ్చే న‌ష్టాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. అందుకే ప‌లు రోగాల బారిన ప‌డుతూ మందుల‌తోనే స‌హ‌జీవ‌నం చేస్తున్నాడు. శ‌రీరానికి అన‌ర్థాలు వ‌స్తున్నా అర్థం చేసుకోవ‌డం లేదు. ఇప్ప‌టికైనా ఆరోగ్యం కోసం త‌న ఆహార‌పు అల‌వాట్లు మార్చుకుని మంచి ఆరోగ్యం సొంతం చేసుకోడానికి ప్ర‌య‌త్నిస్తే మంచిది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...
Nagarjuna

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Talliki Vandanam Scheme 2026

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....
NEET Protest Delhi

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...
AI Impact On Education

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper