post office : డబ్బులు సేవ్ చేయడం పెద్ద టాస్క్. ఇంట్లో పెట్టిన ఉండవు. బ్యాంకులో దాచినా ఆగవు. సో ఇన్వెస్ట్ మస్ట్. ఈ ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యం. కానీ ఎక్కడ చేయాలి? ఎందులో చేయాలి అనేది మరో టాస్క్. ఇక ఎక్కడ పెట్టుబడి పెట్టాలన్నా కూడా చాలా రిస్క్. రిస్క్ లేని ప్లేస్ లు ఇన్వెస్ట్ చేయడం మాత్రమే సేఫ్. మరి అలాంటి ప్లేస్ ఏదని చూస్తున్నారు. రిస్క్ లేకుండా ఇన్వెస్ట్ చేయడానికి మంచి మార్గం పోస్టాఫీస్ అంటారు నిపుణులు. అందుకే ఎక్కువగా ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు చాలా మంది.
ప్రస్తుతం చాలా మంది ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ల మీదనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది చాలా సేఫ్ కాబట్టి ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో మంచి లాభాలు వస్తాయి. మంచి ఇంట్రెస్ట్ కూడా సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. అన్ని వయస్సుల వారికి ప్రయోజనం కూడా ఈ స్కీములు. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి మరింత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్కమ్ అకౌంట్ లో 7.4 శాతం వడ్డీ రేటు లభిస్తుంది అంటున్నారు నిపుణులు.
అయితే ఈ స్కీములో మీరు ఎక్కువగా రూ. 9 లక్షల వరకు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక జాయింట్ అకౌంట్ అయితే 15 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు అంటున్నారు నిపుణులు. 5 సంవత్సరాల కాలపరిమితితో ఉంటుంది. అయితే జాయింట్ అకౌంట్ కు సైతం 5 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. అంటే 15 లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చట.
అనివార్య కారణాల వల్ల మధ్యలోనే అకౌంట్ ను క్లోజ్ చేస్తే కూడా ఎలాంటి టెన్షన్ ఉండదు. వడ్డీ మొత్తంలో కొంత మొత్తం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ స్కీమ్ లో 15 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇలా చేస్తే ఐదేళ్ల తర్వాత ఏకంగా దాదాపుగా ఐదున్నర లక్షల రూపాయల వడ్డీ వస్తుంది అంటున్నారు నిపుణులు. పోస్ట్ ఆఫీస్ లో నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఉంది. అయితే ఇందులో మీకు వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంటుంది.
అయితే పోస్ట్ ఆఫీస్ లో ఇన్వెస్ట్ చేస్తే దాదాపుగా అన్ని పథకాలకు కూడా ఒకే విధమైన వడ్డీ రేటు ఉంటుంది. అయితే మీకు దగ్గరలో ఉన్న పోస్టాఫీస్ కు వెళ్లి దీని గురించి పూర్తి స్థాయిలో అవగాహనకు రండి. ఆ తర్వాత పెట్టుబడి పెట్టడం వల్ల మీకు మంచి రిటర్న్ వస్తాయి.