https://oktelugu.com/

Thangalaan OTT: ఎట్టకేలకు ఓటీటీలో తంగలాన్, విక్రమ్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్, ఎక్కడ చూడొచ్చు?

దాదాపు థియేటర్స్ లో విడుదలైన నాలుగు నెలలకు తంగలాన్ మూవీ ఓటీటీ లోకి వచ్చింది. విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ చడీ చప్పుడు లేకుండా డిజిటల్ స్ట్రీమింగ్ మొదలైంది. ఈ సినిమా ఓటీటీలో వస్తే చూసి ఎంజాయ్ చేయాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వారి కోరిక నెరవేరింది..

Written By:
  • S Reddy
  • , Updated On : December 11, 2024 / 09:03 AM IST

    Thangalaan OTT

    Follow us on

    Thangalaan OTT: ప్రయోగాత్మక చిత్రాలకు విక్రమ్ పెట్టింది పేరు. పాత్ర కోసం శరీరాన్ని మార్చుకునే నటుల్లో ఒకరు. విక్రమ్ కి తమిళ్ తో పాటు తెలుగులో కూడా మార్కెట్ ఉంది. ఆయన హీరోగా నటించిన అపరిచితుడు ఒక సంచలనం. శంకర్-విక్రమ్ కాంబోలో అపరిచితుడు తెరకెక్కింది. అనంతరం వీరు ఐ టైటిల్ తో మరొక చిత్రం చేశారు. అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇదిలా ఉంటే… విక్రమ్ నటించిన మరో విలక్షణ చిత్రం తంగలాన్. దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కించారు.

    ఈ చిత్రంలో విక్రమ్ డీ గ్లామర్ రోల్ చేశాడు. బ్రిటిష్ కాలానికి చెందిన ఓ తెగకు చెందిన వ్యక్తి పాత్ర చేశాడు. విక్రమ్ గెటప్, లుక్ సంచలనం రేపింది. అసలు విక్రమ్ గుర్తు పట్టలేనంతగా ఈ చిత్రంలో ఉంటారు. తంగలాన్ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే పురస్కరించుకుని ఆగస్టు 15న విడుదల చేశారు. తంగలాన్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమా పర్లేదు అనిపించుకుంది. అంచనాలు మాత్రం అందుకోలేదని చెప్పొచ్చు.

    కాగా తంగలాన్ ఓటీటీ విడుదలకు సమస్య ఎదురైంది. తమిళనాడులోని తిరువళ్లూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తంగలాన్ ఓటీటీ విడుదలకు వ్యతిరేకంగా పిల్ దాఖలు చేశాడు. తంగలాన్ మూవీలో దర్శకుడు వైష్ణవులను కించపరిచారు. బౌద్ధ మతాన్ని ఎంతో ఉన్నతమైనదిగా చూపించిన దర్శకుడు , వైష్ణవులను అవమానపరిచే విధంగా సన్నివేశాలు రూపొందించారు. ఈ సినిమా మత ఘర్షణలకు దారి తీసే అవకాశం ఉంది. కనుక ఓటీటీలో విడుదల కాకుండా అడ్డుకోవాలని పిటీషన్ లో పేర్కొన్నారు.

    దాదాపు నాలుగు నెలల అనంతరం తంగలాన్ ఓటీటీ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. తంగలాన్ డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ అక్కడ స్ట్రీమ్ అవుతుంది. తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో తంగలాన్ అందుబాటులో ఉన్నట్లు సమాచారం.

    ఇక తంగలాన్ మూవీ కథ విషయానికి వస్తే… ఇండియాలోని ఒక ప్రాంతంలో గోల్డ్ దొరుకుతుందని తెలుసుకున్న బ్రిటిష్ దొర, దాన్ని దక్కించుకోవాలని అనుకుంటాడు. దాన్ని తవ్వి తీసేందుకు తంగలాన్, అతని గ్రామ ప్రజల సహాయం కోరతాడు. తంగలాన్ అందుకు ఒప్పుకుంటాడు. గోల్డ్ ని తవ్వి తీసే క్రమంలో అనేక ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. చివరికి గోల్డ్ దొరికిందా? తంగలాన్ పోరాటం ఎలా ముగిసింది ? అనేది కథ…