spot_img
Homeలైఫ్ స్టైల్Vastu Tips: డబ్బు ఇంట్లో నిలవడం లేదా? డబ్బుకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏం చేయాలో...

Vastu Tips: డబ్బు ఇంట్లో నిలవడం లేదా? డబ్బుకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

Vastu Tips
Vastu Tips

Vastu Tips: ప్రతి మనిషికి బతకడానికి ఎంతో కొంత డబ్బు కావాలి. అవసరాలు తీరాలంటే డబ్బే ప్రధానం. దీంతో సంపాదనపై అందరికి శ్రద్ధ ఎక్కువే. కొందరికి డబ్బు సులభంగానే వచ్చినా మరికొందరికి ఎంత కష్టపడినా తక్కువే వస్తుంది. రాబడి తగ్గితే ఖర్చులు పెరుగుతాయి. ఇల్లు గడవడం కష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో డబ్బు సంపాదన అందరికి ఇష్టమే. ఎంత కష్టపడినా కొంతమందికి చేతిలో డబ్బు నిలవదు. ఆర్థిక ఇబ్బందులే వేధిస్తాయి. డబ్బు సమస్యకు పరిష్కారమేంటి? సంపాదన పెంచుకోవడమే. చేసే పనిలోనే ఎక్కువ సంపాదించేందుకు అందరు ఉత్సాహపడుతుంటారు. కానీ అది కూడా సాధ్యం కాదు. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లోనే కొట్టుమిట్టాడుతుంటారు.

ఆర్థిక ఇబ్బందులు

ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ఆర్థిక సమస్యలు ఉంటే మనశ్శాంతి ఉండదు. డబ్బు లేకపోతే సంతోషం దక్కదు. ఎంత కష్టపడినా డబ్బుకు ఇబ్బంది ఉంటే వాస్తు దోషాలు ఉన్నాయేమోనని చూసుకోవాలి. వాస్తు చిట్కాలు పాటించి ఆర్థిక కష్టాల నుంచి బయట పడాలని భావించాలి. దీనికి గాను కొన్ని నియమాలు పాటించాల్సిందే. లేకపోతే వాస్తు దోషాలు తలెత్తి ఇంట్లో సమస్యలు చుట్టుముడతాయి. అన్ని వాస్తు ప్రకారం ఉండేలా చూసుకోవాలి.

వాస్తు చిట్కాలు

వాస్తు ప్రకారం ఈశాన్య దిశ మనకు లాభాలు కలిగించే దక్కుగా భావిస్తుంటారు. ఈశాన్య మూల పెరిగితే లాభాలుంటాయి. అందుకే ఈ దిశలో కుబేర యంత్రం ఉంచుకోవడం మంచిది. దానికి నిత్యం పూజలు చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. డబ్బుకు ఎలాంటి ఇబ్బందులు రావు. సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి ఇంట్లో పూజ గది కూడా సరైన దిశలో ఉండాలి. ఈశాన్య దిశలో పూజా గది ఉంటే డబ్బుకు బాధలు ఉండవు. అందరు ఈశాన్య మూలలోనే పూజా గది ఉండేలా ప్లాన్ చేసుకుంటే మంచిది.

Vastu Tips
Vastu Tips

బీరువా విషయంలో..

అంతేకాదు డబ్బులు దాచుకునే బీరువా, లాకర్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. బీరువా ఎప్పుడు కూడా నైరుతి దిశలో ఉంచుకోవాలి. తలుపు తెరిస్తే ఉత్తరం వైపు ఉండేలా చూసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. నైరుతి దిశలోనే బీరువా ఉంచుకోవడం సురక్షితం. డబ్బుకు కొదవ లేకుండా ఉండాలంటే బీరువాను నైరుతిలోనే ఉంచుకుంటే డబ్బు సమస్య ఏర్పడదు. జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా జీవించడానికి తగిన వాస్తు సలహాలు తీసుకుని ముందుకు నడుచుకుంటేనే మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Oktelugu Epaper