
Preethi : పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్‌లో ఆత్మహత్యకు యత్నించిందని పోలీసులు, వైద్యులు చెబుతున్నా. ప్రీతి తండ్రి మాత్రం నరేందర్ మాత్రం తన కూతురుది ఆత్మహత్య కాదని హత్యే అని అంటున్నారు. ఆయన మొదటి నుంచి తన కూతురు విషయంలో ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రీతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, చాలా ధైర్యవంతురాలని పేర్కొంటున్నారు. సీనియర్ సైఫ్ తన కూతురుకు ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడని ఆరోపిస్తున్నారు. పక్కా ప్లాన్‌తో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని పేర్కొన్నాడు. అయితే పోలీసులు మాత్రం ప్రతీ ఆత్మహత్య చేసుకుందని పేర్కొంటున్నారు. వైద్యులు కూడా ప్రతీపై హత్యాయత్నం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటున్నారు.
ఇంజక్షన్ తీసుకున్నది అనేది కట్టుకథే..
ప్రీతి ఇంజక్షన్ తీసుకున్నది అనేది కట్టుకథే అని ప్రభుత్వ వైద్య అసోసియేషన్ సభ్యులు అన్నారు. ఎవరో స్క్రిప్ట్ రాస్తే ఇక్కడ చదువుతున్నారని ప్రీతి తండ్రి మండిపడ్డారు. ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వేధింపులపై హెచ్‌ఓడీకి తాన కూతురు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఆగ్రహం వ్యక్తం చేశారు.
నరేందర్ వద్ద ఆధారాలు ఉన్నాయా?
అయితే ప్రతీ మరణంపై మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్న ఆమె తండ్రి నరేందర్ సీనియరే చంపేశాడని ఆరోపిస్తున్నారు. దీనికి సబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్య తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. తన కూతురిది హత్య అనేందుకు పోలీసులకు ఆధారాలు కూడా సమర్పించారని చెబుతున్నాడు. అయితే ఎలాంటి ఆధారాలు ఇచ్చాడనేది మాత్రం చెప్పడం లేదు. ఆధారాలు సమర్పించినా పోలీసులు చర్య తీసుకోవడం లేదని మాత్రమే నరేందర్ విమర్శిస్తున్నాడు. ప్రీతిది ముమ్మాటికీ హత్యే అని ఆమె తండ్రి బలంగా నమ్ముతున్నాడు.
పోస్టుమార్టం రిపోర్టులో ఏముంది?
హత్య, ఆత్మహత్య అనే అనుమానాల మధ్య ప్రీతి మృతదేహాన్ని ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోస్టుమార్టం కోసం నిమ్స్ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరి పోస్టుమార్టం రిపోర్టులో ఏముందనేది తెలియాల్సి ఉంది. నిమ్స్ వైద్యులు చెప్పినట్లు ప్రతీ శరీరంలో ఎలాంటి విషపూరిత ఆనవాళ్లు లేవని చెబుతారా? లేక ఏౖ§ð నా సంచలన విషయాలు బహిర్గతం అవుతాయా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
హెచ్‌ఓడీ, ప్రిన్సిపాల్‌పై చర్యలకు డిమాండ్..
ఇదిలా ఉండగా కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, డిపార్ట్‌మెంట్ హెడ్‌పై చర్యలకు చర్యలకు ప్రీతి తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు. తమ కూతరు మరణానికి వారే బాధ్యులని ఆరోపిస్తున్నారు. వారిని సస్పెండ్ చేయకుండా విచారణ జరిగితే అన్యాయమేనని అన్నారు. నిందితుడు సైఫ్‌కు మద్దతుగా సీనియర్లతో హెచ్‌ఓడీ స్ట్రైక్ చేయిస్తున్నారని ఆరోపించారు. నిందితుడు సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.