COVID-19 Mock Drill: కరోనా వైరస్ మరోమారు విజృంభిస్తోంది. ఇప్పటికే మూడు దశలు మనుషులను ఇబ్బంది పెట్టిన వైరస్ మళ్లీ తన తడాఖా చూపించాలని విస్తరిస్తున్నట్లు అనిపిస్తోంది. ఇందులో భాగంగా ఒమిక్రాన్ వేరియంట్ రూపాంతరం చెంది ప్రపంచాన్ని గడగడలాడించనుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నాలుగో దశలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. దీంతో దేశమంతా కరోనా వైరస్ నిర్మూలనకు మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కరోనా మాక్ డ్రిల్ దేశవ్యాప్తంగా నిర్వహించాలని నేడు సిద్ధపడింది.

దేశంలోని ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్న మాక్ డ్రిల్ లో వైద్యాధికారులు, డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది పాల్గొంటున్నారు. నాలుగో దశ ఎలా ఎదుర్కోవాలోననే దానిపై దృష్టి సారించారు. కరోనా రోగులను తీసుకురావడం, వారికి మందులు ఎలా ఇవ్వడం, ఆక్సిజన్ అందించడం, ఐసోలేషన్, క్వారంటైన్ తదితర విషయాలపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే మాక్ డ్రిల్ నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. కరోనా వస్తే ఏం చేయాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై కూడా కసరత్తు చేస్తున్నారు.
మాక్ డ్రిల్ ద్వారా వైద్య వసతుల్లో లోపాలు ఏవైనా ఉంటే తెలిసిపోతాయి. ఆరోగ్య వసతుల కల్పన, ఐసోలేషన్ సామర్థ్యం, బెడ్ల తీరు, వెంటిలేషన్ తదితర ఇబ్బందులు లేకుండా చూసుకోవాలనేదే సర్కారు సంకల్పం. ఈ నేపథ్యంలో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది లభ్యత వంటి విషయాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలని భావిస్తున్నారు. ముందస్తు ప్రిపరేషన్ తో ఏ లోపాలున్నాయో తెలిసిపోతుంది. ఆక్సిజన్ సిలిండర్లు సరిపోకపోతే వాటిని ముందే తెప్పించుకుని ఎలాంటి ముప్పు రాకుండా చూసుకోవడమే ప్రధాన ఉద్దేశం.

ఒమిక్రాన్ వేరియంట్ బీఎఫ్ 7 ప్రభావంతో ప్రజలు భయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా తిరగొద్దని సూచిస్తున్నారు. తగిన జాగ్రత్తలు పాటించాలని పిలుపునిస్తున్నారు. కరోనా ముప్పును ఎదుర్కోవాలంటే సంకల్ప బలం కావాలి. మాక్ డ్రిల్ తో సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ పరిశీలించననున్నారు. ప్రజలు మాస్కులు ధరించాలని చెబుతున్నారు. కరోనాను నిర్మూలించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.